Singer Sunitha: తడిగుడ్డతో గొంతుకోసే రకాలు చాలామంది ఉన్నారు.. పెళ్లిపై సింగర్ సునీత షాకింగ్ కామెంట్స్!

Singer Sunitha

Singer Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత పరిచయం గురించి, తన పాడే పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరలో కొన్ని షోలలో వ్యాఖ్యాతగా, సహాయ దర్శకురాలిగా పరిచయమైన సింగర్ సునీత.. కొన్ని ఏళ్ళ తర్వాత వెండితెరపై సింగర్ గా అడుగు పెట్టింది.

  • Share this:
    Singer Sunitha: టాలీవుడ్ సింగర్ సునీత పరిచయం గురించి, తన పాడే పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లితెరలో కొన్ని షోలలో వ్యాఖ్యాతగా, సహాయ దర్శకురాలిగా పరిచయమైన సింగర్ సునీత.. కొన్ని ఏళ్ళ తర్వాత వెండితెరపై సింగర్ గా అడుగు పెట్టింది. గులాబీ సినిమాలో పాడిన ఈ వేళలో నీవు పాటను తొలిసారిగా వినిపించి తన స్వరంతో ఎంతో మంది హృదయాలను అభిమానులుగా మార్చుకుంది. ఎన్నో సినిమాలలో డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా చేసింది. ఇదిలా ఉంటే తాజాగా తన రెండో పెళ్లి గురించి కొన్ని విషయాలు పంచుకుంది.

    ఎన్నో ఏళ్ళు ఒంటరి జీవితాన్ని గడిపిన సింగర్ సునీత ఆ సమయంలో ఎన్నో పుకార్లు ఎదుర్కొంది. ఇక వాటి గురించి ఎప్పుడు స్పందించనేలేదు. కానీ కొన్ని రోజుల కిందట రామ్ వీరపనేని అనే ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని గడుపుతుంది. ఎంతో సంతోషంగా ఉంది. కానీ తాను రెండో పెళ్లి చేసుకున్న కూడా కొందరు ఆమెను రకరకాలుగా ట్రోల్స్ చేశారు. అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తన జీవితాన్ని హ్యాపీ గా గడుపుతుంది.

    ఇదిలా ఉంటే తాజాగా ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొంది సునీత. తన వ్యక్తిగత విషయాల గురించి పంచుకుంటూ.. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఎదురైన కొన్ని విషయాలను తెలిపింది. తను ఎవరి గురించి పట్టించుకోనని.. తాను చేయాల్సిన పనిని మాత్రమే చేస్తానని తెలిపింది. తనకంటూ ఓ గుర్తింపు ఉందని తెలిపింది. మంచి సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి టాలెంట్ ఉందని అన్నది. తాను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత చాలామంది కామెంట్ చేశారని.. తనను ఓన్ చేసుకొని అభిమానించారని తెలిపింది.

    పెళ్లికాకముందు తనతో చాలామంది మాట్లాడేవారని.. కానీ పెళ్లి తర్వాత ఉన్నట్టుండి మాట్లాడటం మానేశారని.. అందుకు బాధపడనని, పట్టించుకోనని తెలిపింది. తను పెళ్లి చేసుకోవడం చాలా మందికి ఇష్టం లేదని బయటపెట్టింది. అందరికీ ఒక మనసుందంటూ.. సొసైటీల్లో చాలామందికి అలా ఉండదని.. తను పెళ్లి చేసుకోకుండా ఉంటే చాలామందికి సంతోషమని తెలిపింది. పెళ్లి చేసుకున్నానని అని తెలియడంతో చాలామంది కామెంట్ చేశారని తెలిపింది. తను పెళ్లి చేసుకుంటే ఎవరికి ఎందుకు చెప్పాలి.. తన ఇంట్లో వాళ్లకి మాత్రం తెలిస్తే చాలు. అంతేకానీ ఎవరితో నేను పంచుకోలేను.. కొందరు తడిగుడ్డతో గొంతు కోసిన రిలేషన్స్ కూడా ఉన్నారని తెలిపింది.
    Published by:Navya Reddy
    First published: