Home /News /movies /

TOLLYWOOD SINGER SUNITHA SHARES EMOTIONAL POST ABOUT SP BALA SUBRAMANYAM IN SOCIAL MEDIA NR

Singer Sunitha: అలా బ‌తికేస్తున్న అంటూ సింగ‌ర్ సునీత ఎమోష‌న‌ల్.. వైరల్ అవుతున్న పోస్ట్

Singer Sunitha

Singer Sunitha

Singer Sunitha: తెలుగు సిని సింగర్ సునీత పరిచయం గురించి, తను పాడే పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. తన స్వరంతో ఎంతో మంది హృదయాలను దోచుకున్న సునీత.. ఈమధ్య సోషల్ మీడియాలో కూడా అభిమానులతో బాగా టచ్ లో ఉంటుంది.

    Singer Sunitha: తెలుగు సిని సింగర్ సునీత పరిచయం గురించి, తను పాడే పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. తన స్వరంతో ఎంతో మంది హృదయాలను దోచుకున్న సునీత.. ఈమధ్య సోషల్ మీడియాలో కూడా అభిమానులతో బాగా టచ్ లో ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని బాగా పంచుకుంటుంది. ఇదిలా ఉంటే ఆయన కోసం తాజాగా కన్నీళ్లు పెట్టుకుంది సునీత. ఇంతకీ ఆయన ఎవరో కాదు బాల సుబ్రహ్మణ్యం గారు.

    దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఈయన పేరు వినగానే ఓ మంచి వ్యక్తిని కోల్పోయామన్న విషయం బాగా బాధ పెడుతుంది. గత ఏడాది కరోనా సమయంలో తన అనారోగ్యం పరిస్థితి బాలేకపోవడంతో సెప్టెంబర్ 25న ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఆయన మరణంతో ఎంతోమంది అభిమానులు, సినీ ప్రముఖులు భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటికీ ఆయన పాటలు వింటుంటే మాత్రం ఆయన ఇంకా ఉన్నారన్న ఆలోచనలే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈయన గురించి బాగా ఎమోషనల్ అయ్యింది సింగర్ సునీత.

    శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో గాయకుడిగా పరిచయమైన బాల సుబ్రహ్మణ్యం గారు ఆ తర్వాత పలు భాషలలో దాదాపు 40 వేలకు పైగా పాటలు పాడారు. అంతేకాకుండా పలు సినిమాల్లో కూడా నటించారు. ఈయన బుల్లితెరపై కూడా పలు రియాలిటీ షోలలో పాల్గొని తన పాటలతో అందర్నీ ఆకట్టుకునేవారు. ఇక ఈయన మరణించి దాదాపు ఏడాది కావస్తుండగా తాజాగా సింగర్ సునీత కొన్ని విషయాలు పంచుకుంది.బాల సుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేసుకుంటూ.. మావయ్య ఒక్కసారి గతంలోకి నడవాలని ఉంది. నీ పాట వినాలని ఉంది అంటూ నువ్వు పాడుతుంటే చెమర్చిన కళ్ళతో చప్పట్లు కొట్టాలని ఉంది అని ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.
    అంతేకాకుండా ప్రస్తుతం ఏం చేయాలో తెలియని పరిస్థితిగా తన గొంతు మూగబోతుందని.. ఏడాది కావస్తుంది అంటే నమ్మడం చాలా కష్టంగా ఉంది అని తెలిపింది. ఎప్పటికీ మీరే నా గురువు, ప్రేరణ, ధైర్యం, బలం, నమ్మకం అంటూ ఎక్కడ ఉన్న మమ్మల్నందరినీ అంతే ఆప్యాయంగా చూసుకుంటావనే నమ్మకం మాలో ఉందంటూ.. ఆ నమ్మకంతోనే నేను కూడా బతికేస్తున్న అని ఎమోషనల్ గా పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ ని చూసిన అభిమానులు బాల సుబ్రహ్మణ్యం గారిని తలుచుకుంటూ బాగా ఎమోషనల్ అవుతున్నారు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Singer Sunitha, Sp bala subramanyam, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు