Singer Sunitha marriage video: సింగర్ సునీత పెళ్లి వీడియో.. శంషాబాద్‌లోని గుడిలో వివాహం..

సింగర్ సునీత, రామ్ పెళ్లి (Singer Sunitha Ram marriage)

Singer Sunitha marriage video: టాలీవుడ్‌ ప్రముఖ గాయని సునీత పెళ్ళి ఘనంగా జరిగింది. మీడియా బిజినెస్‌మెన్‌ రామ్‌ వీరపనేనితో కొన్ని రోజుల కింద నిశ్చితార్థం జరుపుకున్న ఈమె జనవరి 9న ఆయనతో కలిసి ఏడడుగులు వేసింది.

  • Share this:
టాలీవుడ్‌ ప్రముఖ గాయని సునీత పెళ్ళి ఘనంగా జరిగింది. మీడియా బిజినెస్‌మెన్‌ రామ్‌ వీరపనేనితో కొన్ని రోజుల కింద నిశ్చితార్థం జరుపుకున్న ఈమె జనవరి 9న ఆయనతో కలిసి ఏడడుగులు వేసింది. ఈ క్రమంలోనే సునీత ఇంట పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ శివారు శంషాబాద్‌లోని అమ్మపల్లి దేవాలయంలో సునీత, రామ్ వీరపనేని వివాహ వేడుకలు జరిగాయి. అమ్మపల్లి ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయంలో సునీత పెళ్లి జరిగింది. పెద్ద ఎత్తున వివాహ వేడుకలకు ప్రముఖులు చేరుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యే ఎర్రవల్లి దయాకర్ రావుతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వచ్చారు. రామ్ వీరపనేనితో సన్నిహితంగా ఉండే పలువరు రాజకీయ నాయకులు ఈ పెళ్లిలో సందడి చేసారు. అంతకుముందు జరిగిన మెహందీ వేడుకలో సునీత స్నేహితురాలు, పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్‌‌తో పాటు సుమ కనకాల కూడా వచ్చారు.

అక్కడే ఉండి సునీతను పెళ్లి కూతురును చేసారు. ఆమె మెహందీ వేడుకలో కనువిందు చేసారు. ఆ మధ్య గచ్చిబౌలిలోని ఓ స్టార్‌ హోటల్‌లో సునీత-రామ్‌ ప్రీ వెడ్డింగ్ పార్టీ జరిగింది. దానికి ముందుగానే ఓ హోటల్‌లో స్నేహితులకు పార్టీ ఇచ్చారు ఈ జోడీ.

ఇప్పుడు పెళ్లికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే వస్తున్నారు. దానికి తోడు చాలా తక్కువ మంది మాత్రమే రాబోతున్నారు. ఇందులో టాలీవుడ్‌ నటీనటులతో పాటు టాప్‌ సింగర్స్‌ మాత్రమే హాజరయ్యారు. ఏదేమైనా కూడా సునీత పెళ్లి సందర్భంగా అభిమానులు అంతా ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు. కొత్త జీవితం మొదలు పెడుతున్న సందర్భంలో ఈమెకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: