Singer Sunitha: బిగ్ బాస్ 5 తెలుగులోకి సింగర్ సునీత.. కొత్త పెళ్లికూతురుకు షాకింగ్ ఆఫర్..?

సింగర్ సునీత (Singer Sunitha)

Singer Sunitha: బిగ్ బాస్ తెలుగు సీజన్స్ అన్నీ ఓ ఫార్మాట్ ప్రకారం జరుగుతున్నాయి. సీజన్ 4 అయిపోయి మూడు నెలలు కూడా కాకుండానే అప్పుడే సీజన్ 5 గురించి చర్చ మొదలైపోయింది. కరోనా కారణంగా గతేడాది చాలా ఆలస్యంగా మొదలైంది..

  • Share this:
బిగ్ బాస్ తెలుగు సీజన్స్ అన్నీ ఓ ఫార్మాట్ ప్రకారం జరుగుతున్నాయి. సీజన్ 4 అయిపోయి మూడు నెలలు కూడా కాకుండానే అప్పుడే సీజన్ 5 గురించి చర్చ మొదలైపోయింది. కరోనా కారణంగా గతేడాది చాలా ఆలస్యంగా మొదలైంది బిగ్ బాస్ 4 తెలుగు. డిసెంబర్‌లో పూర్తయింది.. ఇప్పుడు సీజన్ 5 జూన్ నుంచి ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే కంటెస్టెంట్స్ కోసం వెతుకులాట కూడా షురూ అయిపోయింది. ఈ క్రమంలోనే కొందర్ని ఫైనల్ చేస్తున్నారు. యూ ట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్‌కు భారీ ఆఫర్ ఇచ్చి సీజన్ 5 కోసం లాక్ చేసారని తెలుస్తుంది. సీజన్ 2లో ఈయన ప్రేయసి దీప్తి సునయన వచ్చింది. అక్కడ బాగానే పాపులర్ అయింది ఈమె. ఇప్పుడు సీజన్ 5 కోసం షణ్నును అడుగుతున్నారు. మరోవైపు ఈయనతో పాటు టిక్ టాక్ దుర్గా రావు కూడా సీజన్ 5 కంటెస్టెంట్‌గా కన్ఫర్మ్ అయిపోయాడు. కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసాడు దుర్గా రావు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సెలబ్రిటీ కూడా బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆమె ఎవరో కాదు.. సింగర్ సునీత. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో ఉంటుంది ఈమె. దానికి కారణం రెండో పెళ్లి. రామ్ వీరపనేనితో ఈమె ఏడడుగులు నడిచింది. జనవరిలో ఈమె పెళ్లి జరిగింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు వార్తల్లోనే ఉంటూ వస్తుంది సునీత.
bigg boss 5 telugu,bigg boss 5 telugu singer sunitha,bigg boss 5 durga rao,singer sunitha bigg boss offer,singer sunitha second marriage,singer sunitha wedding,singer sunitha ram veerapaneni marriage,telugu cinema,సింగర్ సునీత,సింగర్ సునీత బిగ్ బాస్ 5 తెలుగు,సింగర్ సునీత రామ్ వీరపనేని,బిగ్ బాస్ 5 తెలుగు సునీతకు ఆఫర్
సింగర్ సునీత (Singer Sunitha)

ఇప్పుడు బిగ్ బాస్ 5 తెలుగు కోసం ఈమెను నిర్వాహకులు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సింది కూడా లేదు. ఎందుకంటే తొలి సీజన్ నుంచి కూడా ఈ ఫార్మాట్ ఫాలో అవుతున్నారు నిర్వాహకులు.
సింగర్ సునీత (Singer Sunitha)
సింగర్ సునీత (Singer Sunitha)

సీజన్ 1లో కల్పన.. సీజన్ 2లో గీతా మాధురి.. సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్.. ఇలా ప్రతీ సీజన్‌లోనూ ఓ సింగర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు న్యూ సీజన్ కోసం సునీతను అడుగుతున్నారు. మొన్నే పెళ్లైంది కాబట్టి ఈమె ఒప్పుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఈ షో కోసం మాత్రం సునీతకు ఊహించని ఆఫర్ ఇచ్చారని తెలుస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published: