• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD SINGER SUNITHA EMOTIONAL ON DRAMA JUNIORS SET REASONS NR

Singer Sunitha: స్టేజి మీదే కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ సునీత.. ఎందుకంటే?

Singer Sunitha: స్టేజి మీదే కన్నీళ్లు పెట్టుకున్న యాంకర్ సునీత.. ఎందుకంటే?

singer sunitha

Singer Sunitha: ప్రముఖ తెలుగు సింగర్ సునీత పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఈమె పాడే పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

  • Share this:

    Singer Sunitha: ప్రముఖ తెలుగు సింగర్ సునీత పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఈమె పాడే పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక ఆమెకు సింగర్ గా మంచి గుర్తింపు అందింది. ఇదిలా ఉంటే ఆమె కొన్ని రోజుల కిందట రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉండగా ఈమధ్య మళ్లీ అవకాశాలను అందుకుంటుంది.


    అంతేకాకుండా ప్రస్తుతం ఆమె బుల్లితెరలో ఓ ప్రోగ్రాంలో కూడా అవకాశాన్ని అందుకుంది. జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ షో లో జడ్జిగా చేస్తుంది. అంతేకాకుండా రేణు దేశాయ్, ఎస్ వి కృష్ణారెడ్డి లు కూడా ఈ షోలో జడ్జిగా చేస్తున్నారు. ఇక ఇందులో పాల్గొన్న బుడతలు తన టాలెంట్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు‌. ఇదివరకే డ్రామా జూనియర్స్ సీజన్ లు ప్రసారం కాగా.. ఇటీవలే మరో సీజన్ తో ముందుకు వచ్చారు. ఇదిలా ఉంటే ఈ ప్రోగ్రామ్ స్టేజి మీదే సునీత బాగా ఎమోషనల్ అయ్యింది.


    ఆదివారం ప్రసారమైన డ్రామా జూనియర్స్ బాగా ఆకట్టుకోగా.. అందులో యాంకర్ ప్రదీప్ కు బదులు రవి యాంకరింగ్ చేశాడు. ఇక యంగ్ తేజ సజ్జ స్పెషల్ గెస్ట్ గా ఈ ప్రోగ్రాం లో పాల్గొన్నాడు. ఇక బుడతలు తమ స్కిట్ లతో బాగా ఆకట్టుకున్నారు. కామెడీ, ఎమోషనల్ వంటి స్కిట్ లతో ప్రేక్షకులను ఫిదా చేశారు. ఇక ఇందులో ఎమోషనల్ స్కిట్ అందర్నీ బాగా ఆకట్టుకోగా ఎమోషనల్ కూడా చేసింది.


    ఇందులో ఒక అమ్మాయికి హీరోయిన్ గా కావాలని కోరిక ఉంటుంది. ఇక చిన్నప్పటినుంచి నటన పై ఆసక్తి తో సినిమాల్లో హీరోయిన్ గా నటించాలని ఉంటుంది. కానీ ఆమె హీరోయిన్ కావడం తన తండ్రికి ఇష్టం లేదు. మన ఇంటవంట లేనిది ఆ సినీరంగానికి వద్దు అని అనగా.. మొత్తానికి తన నాన్నను ఒప్పించి హీరోయిన్ గా మారుతుంది. ఇక ఆమె స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన తర్వాత.. ఆమె గురించి టీవీలో ఓ పుకారు వార్త విన్న ఆమె తండ్రి ఆ విషయాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగి చనిపోతాడు. ఇక ఆమె తల్లి తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక.. మాలాంటి వాళ్లను గాసిప్స్ తో మా జీవితాలను నాశనం చెయ్యకండి అంటూ బాగా ఎమోషనల్ అవుతుంది.


    ఇక ఈ స్కిట్టు తో బాగా కనెక్ట్ అయిన జడ్జిలు బాగా ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా సునీత స్టేజి మీద కన్నీరే పెట్టుకున్నారు. చాలా కనెక్ట్ అయిపోయాం అంటూ.. మీకు మేము సెలబ్రెటీలు అవ్వచ్చు.. మీరు మమ్మల్ని ఏమైనా చెయ్యొచ్చు కానీ సినిమాల్లో ఆడిపాడే బొమ్మలం కావచ్చు కానీ అమ్మలంరా అంటూ బాగా ఎమోషన్ అయ్యారు.

    Published by:Navya Reddy
    First published: