Home /News /movies /

Singer Chitra: నా జీవితం ఇలా ఉండడానికి వారిద్దరే కారణం.. సింగర్ చిత్ర!

Singer Chitra: నా జీవితం ఇలా ఉండడానికి వారిద్దరే కారణం.. సింగర్ చిత్ర!

Singer Chitra

Singer Chitra

Singer Chitra: సింగర్ చిత్ర గురించి తెలియని వారెవ్వరు లేరు. ఎన్నో భాషలలో ఎన్నో వేల పాటలు పాడి ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది చిత్ర. తన పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకొని 'దక్షిణ భారత నైటింగేల్' అనే బిరుదును అందుకుంది.

    Singer Chitra: సింగర్ చిత్ర గురించి తెలియని వారెవ్వరు లేరు. ఎన్నో భాషలలో ఎన్నో వేల పాటలు పాడి ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది చిత్ర. తన పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకొని 'దక్షిణ భారత నైటింగేల్' అనే బిరుదును అందుకుంది. అంతేకాకుండా పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఇక పలు రాష్ట్రాలలో ఈమెను ముద్దు ముద్దు పేర్లతో పిలుచుకుంటారు.1979లో మలయాళ సినిమాలో మొదటిసారిగా పాటను పాడి వినిపించిన చిత్ర తొలిసారి పాటతోనే ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. ఆ తర్వాత తెలుగు, హిందీ, బెంగాలీ, కన్నడ, తమిళ, ఒరియా ఇలా మరెన్నో భాషలలో దాదాపు 25 వేలకు పైగా పాటలు పాడి ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. ఇక ఇప్పటికీ ఈమె పాటలంటే ఎంతోమంది అభిమానులు తెగ ఇష్టపడుతుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఈటీవీ లో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా షోలో పాల్గొని తన పాటలతో, మాటలతో ప్రేక్షకుల హృదయాలను బాగా ఆకట్టుకుంది. కానీ ఇప్పటివరకు చిత్రకు వంట చేయడం రాదట.

    షో ఎంట్రీ తోనే చిత్ర పై పూల వర్షాన్ని కురిపించారు. ఇక ఈమెను ఈ షోకి మిమ్మల్ని పిలవాలని ఎంతోమంది అభిమానులు కోరారని ఆలీ చిత్రతో అంటాడు. ఆలీ తనను ఏమీ అడుగుతాడో అని టెన్షన్ పడటంతో ధైర్యం ఇస్తాడు ఆలీ. ఇక తనతో కొన్ని పాటలు కూడా పాడించాడు. తెలుగు రాకుండా కూడా ఎంతో అద్భుతంగా మాట్లాడిన చిత్ర మాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక తను పాడిన పాటల గురించి, తన గురించి కొన్ని విషయాలు పంచుకుంది చిత్ర.

    ఇదిలా ఉంటే ఆలీ.. మీరు వంట కూడా బాగా చేస్తారు అనడంతో.. వంట మాత్రం రాదు అంటూ.. తినడం మాత్రం బాగా వచ్చని తెలిపింది. ఇక వంట ఎవరు చేస్తారు? ఆయన చేస్తారా అని ప్రశ్నించడంతో.. ఆయనకు కూడా ఏమీ రాదని.. పైగా టీ పెట్టడం కూడా రాదని తెలిపింది. తనకు మాత్రం చిన్న చిన్న వంటలు దోశలు, చట్నీలు వంటివి చేయడం.. టీ, కాఫీలు మాత్రం పెట్టడం వచ్చని.. పెద్ద వంటలు మాత్రం రావని తెలిపింది.



    ఒకవేళ నేను మీ ఇంటికి వస్తే ఏం వండి పెడతారని ఆలీ అనడంతో.. తన ఇంట్లో వంట చేసేవాళ్ళు ఉన్నారని తెలిపింది. ఇక తను పాడిన 'ఆహా ఏమి రుచి' అనే పాటను ప్లే చేయగా అక్కడ కాస్త ఫన్నీ క్రియేట్ చేశాడు ఆలీ. అంతే కాకుండా తను వంట చేయడానికి కిచెన్ లోకి వెళితే వెంటనే తన భర్త క్లబ్ కి వెళ్తాడని సరదాగా తెలిపింది చిత్ర. ఇక తన జీవితం ఇంత సరదాగా ఉండటానికి కారణం స్వర్గస్తులైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారని, కె.జె ఏసుదాస్ అని తెలిపింది చిత్ర. అలా తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను పంచుకోగా మొత్తానికి ఈ ఎపిసోడ్ చాలా సరదాగా కనిపించింది. ఇక కామెంట్ సెక్షన్ లో ఎంతోమంది అభిమానులు చిత్ర వచ్చినందుకు సంతోషమని అంటున్నారు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Alitho Saradaga, Comedian ali, Singer chitra, Sp balasubramanya, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు