Kiran Kumar ThanjavurKiran Kumar Thanjavur
|
news18-telugu
Updated: October 17, 2019, 12:19 PM IST
ప్రభాస్,విజయ్ దేవరకొండ (File Photos)
బాహుబలి సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్.. ఆ తర్వాత ‘సాహో’ సినిమాతో హీరోగా తన సత్తా ఏంటో చూపించాడు. తాజాగా యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్‌కు టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అమూల్యమైన సలహా ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. హాలీవుడ్లో తెరకెక్కిన ‘టర్మినేటర్ డార్క్ ఫేట్’ చివరి పార్ట్‌ను నవంబర్ 1న ఇంగ్లీష్‌తో హిందీ,తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను విజయ దేవరకొండ హైదరాబాద్‌లో విడుదల చేసాడు. ఈ సందర్భంగా దేవరకొండ మాట్లాడుతూ.. ప్రభాస్ అన్న‘టర్మినేటర్’ లాంటి సినిమాలు చేయాలి. తెలుగులోకి హాలీవుడ్ సినిమాలను తీసుకొస్తున్న డిస్నీ పిక్చర్స్ సంస్థ ‘సాహో’, ‘సైరా’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లాంటి సినిమాలను హాలీవుడ్‌కు తీసుకెళ్లాలి అంటూ చెప్పుకొచ్చాడు.

విజయ్ దేవరకొండ, ప్రభాస్
Published by:
Kiran Kumar Thanjavur
First published:
October 17, 2019, 12:14 PM IST