HOME »NEWS »MOVIE »tollywood sensational director koratala siva shocking comments on his retirement and producers gets shocked pk

కొరటాల శివ రిటైర్మెంట్.. షాక్‌లో టాలీవుడ్ నిర్మాతలు..

కొరటాల శివ రిటైర్మెంట్.. షాక్‌లో టాలీవుడ్ నిర్మాతలు..
కొరటాల శివ ఫైల్ ఫోటో

Koratala Siva: రాజమౌళి తర్వాత ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ. అలాంటి దర్శకుడు అప్పుడే రిటైర్మెంట్ తీసుకుంటానని చెబుతున్నాడు. ఇది విన్న నిర్మాతలకు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది.

  • Share this:
అదేంటి.. అప్పుడే కొరటాల శివ రిటైర్మెంట్ తీసుకోవడం ఏంటి.. ఈయన చేసిన సినిమాలెన్ని..? అయినా అంత త్వరగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాడు అనుకుంటున్నారా..? రాజమౌళి తర్వాత ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ. సందేశాత్మక కథలను కమర్షియలైజ్ చేసి తెరకెక్కించడంలో ఈయన ఆరితేరిపోయాడు. అయితే ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాలు నాలుగే. 2013లో ప్రభాస్ మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల.. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌, భరత్‌ అనే నేను సినిమాలను తెరకెక్కించాడు. ఈ నాలుగు సినిమాలు మంచి విజయం సాధించాయి.

కొరటాల శివ ఫైల్ ఫోటో (Koratala Siva)
కొరటాల శివ ఫైల్ ఫోటో (Koratala Siva)




దాంతో ఇప్పుడు సినిమాకు 20 కోట్ల వరకు పారితోషికం అందుకునే స్థాయికి ఎదిగాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నాడు ఈయన. ఇలాంటి ఫామ్‌లో ఉన్న దర్శకుడు.. ఇఫ్పుడు ఉన్నట్లుండి తన రిటైర్మెంట్ ప్లాన్స్ కూడా చెప్పేసాడు. అది విన్న తర్వాత నిర్మాతలు కూడా షాక్ అవుతున్నారు. ఈ మధ్యే ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్‌ విషయాలు చెప్పాడు ఈ దర్శకుడు. దర్శకుడిగా తాను కేవలం 10 సినిమాలు మాత్రమే తెరకెక్కించాలని నిర్ణయించుకుని ఇండస్ట్రీకి వచ్చినట్లు తెలిపాడు కొరటాల. తన పదో సినిమానే చివరి సినిమా అని ప్రకటించి అందరికీ షాక్‌ ఇచ్చాడు ఈ తిరుగులేని మాస్‌ డైరెక్టర్‌.

కొరటాల శివ ఫైల్ ఫోటో (Koratala Siva)
కొరటాల శివ ఫైల్ ఫోటో (Koratala Siva)


ఈ స్థాయిలో ఉన్న దర్శకుడు పది సినిమాలకే రిటైర్మెంట్ తీసుకోవటం ఏంటనేది అర్థం కావడం లేదెవ్వరికి. కానీ తాను మాత్రం తన దగ్గరున్న 10 కథలు మాత్రమే డైరెక్ట్ చేసి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో కొనసాగినా కూడా దర్శకత్వం వైపు మాత్రం వెళ్లనని చెప్పాడు. నిర్మాతగా సినిమాలు చేసే అవకాశం ఉందని మాత్రం తెలిపాడు ఈ దర్శకుడు. కానీ ఈ నిర్ణయం ప్రస్తుతానికి మాత్రమే అని.. ఆ తర్వాత మళ్లీ నిర్ణయం మార్చుకోవచ్చేమో అనే హింట్స్ కూడా ఇచ్చాడు ఈ దర్శకుడు.

కొరటాల శివ ఫైల్ ఫోటో (Koratala Siva)
కొరటాల శివ ఫైల్ ఫోటో (Koratala Siva)


ఏదేమైనా కూడా కొరటాల లాంటి దర్శకుడు తలుచుకుంటే మళ్లీ కొత్త కథలు రాయలేడా.. అప్పుడే సినిమాలకు రిటైర్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటున్నారు అభిమానులు. భరత్‌ అనే నేను సినిమా తర్వాత రెండేళ్ళ గ్యాప్ తీసుకున్న ఈయన ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కథ దేవాదాయ శాఖలో జరిగే అక్రమాల చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. రామ్‌ చరణ్‌ కొణిదెల బ్యానర్‌తో కలిసి మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. త్రిష ఈ చిత్రంలో హీరోయిన్. ఇదే ఏడాది దసరా కానుకగా సినిమా విడుదల కానుంది.
Published by:Praveen Kumar Vadla
First published:February 10, 2020, 13:58 IST

टॉप स्टोरीज