జయలలిత బయోపిక్‌తో శోభన్ బాబుగా టాలీవుడ్ సెన్సేషనల్ హీరో..
జయలలిత జీవితంపై ఇప్పుడు ఒకటి రెండు కాదు ఏకంగా మూడు బయోపిక్స్ వస్తున్నాయి. అమ్మ చనిపోయిన మూడేళ్లకు వరసగా అందరూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ఓ బయోపిక్ వస్తుండగా..

శోభన్ బాబు జయలలిత ఫైల్ ఫోటోస్
- News18 Telugu
- Last Updated: December 4, 2019, 8:54 PM IST
జయలలిత జీవితంపై ఇప్పుడు ఒకటి రెండు కాదు ఏకంగా మూడు బయోపిక్స్ వస్తున్నాయి. అమ్మ చనిపోయిన మూడేళ్లకు వరసగా అందరూ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ఓ బయోపిక్ వస్తుండగా.. తమిళనాట రెండు వస్తున్నాయి. ఇందులో ఒకటి ది ఐరెన్ లేడీ అంటూ నిత్యామీనన్ హీరోయిన్గా చేస్తున్నారు. ఇక మరో క్రేజీ బయోపిక్ తలైవి. అన్నింట్లోనూ భారీ అంచనాలున్న బయోపిక్ ఇదే. కంగన రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించిన విష్ణు ఇందూరి ఈ చిత్రానికి నిర్మాత.

జయలలిత బయోపిక్ అంటే అందరికీ గుర్తొచ్చే పేర్లు రెండు.. ఒకటి ఎంజీఆర్.. మరోటి కరుణానిధి. ఈమె జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటలన్నీ పోగేసి.. అమ్మకు నివాళిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామంటూ విజయ్ ఇప్పటికే ప్రకటించాడు. అమ్మ జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషించింది ఎంజీఆర్. ఈయన పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. ఇక కరుణానిధిగా ప్రముఖ నటుడు కనిపిస్తున్నాడని తెలుస్తుంది. జయ కుటుంబం నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే బయోపిక్ మొదలుపెట్టాడు విజయ్.
అమ్మ జీవితంలో ఈ ఇద్దరూ కాకుండా మరో కీలకవ్యక్తి కూడా ఉన్నాడు. ఆమె వ్యక్తిగత జీవితంలో ప్రధాన పాత్ర పోషించిన పాత్ర శోభన్ బాబు. ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని విశ్లేషకులు చెబుతున్న మాట. శోభన్ బాబు లేని జయలలిత బయోపిక్ అంటే ఉప్పు లేని పప్పు లాంటిదే. మరి ఈ పాత్రలో ఎవరు నటించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. ఇప్పుడు దీనికి సమాధానం కూడా వచ్చేసింది. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండను శోభన్ బాబు పాత్ర కోసం అడిగారని తెలుస్తుంది. దీనికి ఆయన కూడా ఓకే అన్నట్లు ప్రచారం జరుగుతుంది. శోభన్ బాబు, జయలలిత మధ్య బంధాన్ని విజయ్ ఎలా చూపిస్తాడనేది ఆసక్తికరంగా మారుతుందిప్పుడు. ఒకవేళ అన్నీ కుదిరి శోభన్ బాబుగా విజయ్ దేవరకొండ కనిపిస్తే మాత్రం సంచలనమే.

శోభన్ బాబుగా విజయ్ దేవరకొండ

Loading...