అవును ఇప్పటి జనరేషన్‌లో నందమూరి బాలకృష్ణకు ఉన్న రికార్డును ఎవరు అందుకోలేరు. వివరాల్లోకి వెళితే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసారు. అంతేకాదు దాదాపు 40కి పైగా సినిమాల్లో ఆయన డ్యుయల్ రోల్లో నటించి రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత ఏఎన్నార్, కృష్ణ కూడా ఎక్కువ సినిమాల్లో డబుల్ రోల్లో నటించిన మెప్పించారు. ఆ తర్వాత జనరేషన్ విషయానికొస్తే..ఎక్కువ సినిమాల్లో డ్యూయల్ రోల్లో నటించిన రికార్డు బాలకృష్ణ సొంతం. బాలయ్య మొదటి సారి ‘అపూర్వ సహోదరులు’ సినిమాలో ద్విపాత్రాభినయం చేసారు. ఆ తర్వాత ‘రాముడు భీముడు’,‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’,‘ఆదిత్య 369’,‘మాతో పెట్టుకోకు’, ‘శ్రీకృష్ణార్జున విజయం’,‘పెద్దన్నయ్య’, ‘సుల్తాన్’,‘చెన్నకేశవ రెడ్డి’,‘అల్లరి పిడుగు’, ‘ఒక్క మగాడు’,‘పాండు రంగడు’, ‘సింహా’,‘పరమవీర చక్ర’, ‘లెజెండ్’వంటి 15 సినిమాల్లో రెండు పాత్రల్లో నటించాడు. అది కాకుండా..‘అధినాయకుడు’లో త్రిపాత్రాభియం చేసాడు. ఈ రకంగా 16 సినిమాల్లో ఒకటి కంటే ఎక్కువ పాత్రల్లో నటించిన హీరోగా ఈ జనరేషన్‌లో బాలయ్య రికార్డు నెలకొల్పాడు.
తాజాగా బాలకృష్ణ..కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో రెండోసారి యాక్ట్ చేస్తోన్న ‘రూలర్’ చిత్రంలో నందమూరి నటసింహం మరోసారి డ్యుయల్ రోల్లో యాక్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్,వేదిక హీరోయిన్స్‌గా నటించారు. భూమిక, జయసుధ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ రకంగా చూస్తే..బాలకృష్ణ డబుల్ రోల్లో యాక్ట్ చేస్తోన్న 17వ సినిమా అవుతోంది ‘రూలర్’. ఈ సినిమాలో బాలకృష్ణ..పోలీస్ ఆఫీసర్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడనేదే ఈ సినిమా స్టోరీ. ఏ రకంగా చూసిన ఇప్పటి జనరేషన్‌లో ఇన్ని సినిమాల్లో డబుల్ రోల్ యాక్ట్ చేసిన హీరో ఎవరు లేరు. అదే చిరంజీవి విషయానికొస్తే..దాదాపు 13 సినిమాల్లో ఆయన ద్విపాత్రాభినయం చేసారు. ఏమైనా ఇప్పటి తరంలో ఏ హీరో కూడా ఈ అంకెను అందుకోవడం అంత ఈజీ కాదనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, K. S. Ravikumar, NBK 105, Ruler, Telugu Cinema, Tollywood