Home /News /movies /

TOLLYWOOD SENIOR TOP HERO NANDAMURI BALAKRISHNA DONT CARE ABOUT BAD SENTIMENTS FOR NBK105 FILM TA

బ్యాడ్ సెంటిమెంట్‌‌ను లెక్క చేయని బాలకృష్ణ..

బాలయ్య న్యూ లుక్ (Source: Twitter)

బాలయ్య న్యూ లుక్ (Source: Twitter)

హీరో నందమూరి బాలకృష్ణను బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. వివరాల్లోకి వెళితే..

    హీరో నందమూరి బాలకృష్ణను బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది. ముఖ్యంగా 2019 నందమూరి ఫ్యామిలీకి అంతగా కలసిరాలేదు. తన తండ్రి దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఆ తర్వాత ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైంది. రాయలసీమలో బాలకృష్ణ,చంద్రబాబు, పయ్యావుల కేశవ్ ముగ్గురు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ రకంగా 2019 నందమూరి బాలకృష్ణకు చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది.

    NBK 105 రోమాంటిక్ లుక్ Photo : facebook/NandamuriBalakrishna


    ప్రస్తుతం బాలకృష్ణ.. కే.యస్. రవికుమార్ దర్శకత్వంలో 105 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య కొత్త లుక్‌లో చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మరోవైపు భూమిక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ మూవీని మాత్రం డిసెంబర్‌లోనే విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు బాలకృష్ణ. ఈ దసరాకు ఫస్ట్ లుక్‌లో పాటు టైటిల్‌ను అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. ఈ సినిమాకు ‘రూలర్’ లేదా ‘క్రాంతి’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. మొత్తానికి 2019 కలిసి రాకున్న బాలకృష్ణ తాను యాక్ట్ చేసిన కొత్త సినిమాను ఇదే ఇయర్ విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. మరి బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ ఈ సినిమాతో బాలయ్య హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
    First published:

    Tags: Balakrishna, Ks ravikumar, NBK, NBK 105, NTR Biopic, Telugu Cinema, Tollywood

    తదుపరి వార్తలు