Publicity Designer Eswar : చిత్రసీమలో మరో విషాదం.. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ మృతి..

ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ కన్నుమూత (File/Photo)

Publicity Designer Eswar : చిత్రసీమలో మరో విషాదం.. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ అనారోగ్యంతో మృతి చెందారు.

 • Share this:
  Publicity Designer Eswar : టాలీవుడ్ చిత్రసీమలో మరో విషాదం.. ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈయన తెలుగులో దాదాపు వెయ్యికి పైగా చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా పనిచేశారు. చెన్నైలోని తన ఇంట్లో ఈ రోజు తెల్లవారుఝామున ఆయన కన్నుమూసారు. పబ్లిసిటీ డిజైనర్‌గా ఆయన పలు చిత్రాలకు వైరైటీ పోస్టర్స్ డిజైన్ చేసి ఎంతో మంది హీరోల అభిమాన పాత్రుడయ్యారు.ఈయన స్వస్థలం ఉమ్మడి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు. ఈయనకు చిన్నప్పటి నుంచి ఈయనకు బొమ్మలు గీయడం అంటే మక్కువ. అంతేకాదు వాళ్ల ఇంట్లో అందరు బొమ్మలు గీసే వృత్తిలో ఉండటంతో ఆయన స్వతహాగా ఈయన అడుగులు కూడా ఆ వైపు పడ్డాయి. బొమ్మలు గీయడంలో ఆసక్తితో పాటు సినిమాల్లో పని చేయాలనే ఆసక్తితో  ఆయన కాకినాడలో పాలిటెక్నిక్ కాలేజీలో చదువును మధ్యలో ఆపేసి ఓ స్నేహితుడి ప్రోద్భలంలో మద్రాసు రైలు ఎక్కారు. అక్కడ ఆర్టిస్ట్ కేతా వద్ద పోస్టర్ డిజైనింగ్‌ నేర్చుకున్నారు. ఆ తర్వాత పర్ఫెక్ట్ అయ్యారు.

  ఇక ఈయన బాపు తెరకెక్కించిన ‘సాక్షి’ సినిమాతో ఈయన కలర్ పోస్టర్లు, లోగోను తయారు చేశారు. కేవలం బ్రష్‌తో కాకుండా.. నెఫ్ వర్క్‌తో పోస్టర్స్‌ డిజైన్ చేయడంతో ఈయన ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత పబ్లిసిటీ డిజైనర్‌గా ఈయన వెనుదిరిగి చూసుకోలేదు. ఈయన మృతిపై టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు.


  పలు చిత్రాలకు తన డిజైన్స్ ద్వారా ప్రచారం కల్పించిన ఈశ్వర్ తిరిగిరాని లోకాలకు వెళ్లడం బాధాకరమన్నారు. అంతేకాదు ఈశ్వర్ తను నటించిన పలు చిత్రాలకు డిజైనర్‌గా పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. ఈశ్వర్ మృతికి శాంతిని చేకూర్చాలని కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్టు బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.

  Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..  పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్‌తో పాటు  యేడాది తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమ అనే తేడా లేకండా  భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని ఇండస్ట్రీస్‌లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. నిన్న మొన్నటి వరకు కరోనాతో చాలా మంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు కన్నుమూసారు. ఇప్పటికే తమిళ కమెడియన్ వివేక్.. ఆ తర్వాత సీనియర్ నటుడు పొట్టి వీరయ్య..  దర్శకుడు సాయి బాలాజీ, దర్శకుడు కేవి ఆనంద్ వంటి వారు కన్నుమూసారు.

  Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

  అటు బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్‌తో పాటు అలనాటి కథానాయికగా జయంతి, ఆనంద్ కణ్ణన్‌తో, హాలీవుడ్ నటుడు మైఖేల్ విలియమ్‌తో పాటు అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియాతో పాటు ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి కూడా అనారోగ్యంతో కన్నుమూసారు. అటు మలయాళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిజబావాతో పాటు హీరోయిన్ నందిత శ్వేత తండ్రి కూడా అనారోగ్యంతో ఈ యేడాదే కన్నుమూయడం విచారకరం.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: