Suresh Babu: నిర్మాత సురేష్‌ బాబును బురిడీ కొట్టించిన మోసగాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

సురేష్ బాబు (Suresh Babu)

Suresh Babu | టెక్నాలజీని యూజ్ చేసుకొని ఓ కేటుగాడు  నిర్మాత సురేష్‌ బాబును బురిడీ కొట్టించిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.

  • Share this:
    Suresh Babu: టెక్నాలజీ పుణ్యామా అని ఎంతో మంది దాన్ని యూజ్ చేసుకొని పైకొచ్చిన సందర్భాలున్నాయి.  ఈ టెక్నాలజీ అనేది మంచితోపాటు చెడు కూడా ఉన్నాయి. ఇటువంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని ఓ కేటుగాడు  నిర్మాత సురేష్‌ బాబు(Suresh Babu)ను బురిడీ కొట్టించిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్లుగా టెక్నాలజీ పుణ్యామా అని ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ కోవలోనే ప్రముఖ నిర్మాత సురేష్ బాబు (Suresh Babu) దారుణంగా మోసపోయారు. సురేష్ బాబును సదరు వ్యక్తి కరోనా వ్యాక్సినేషన్ పేరుతో మోసానికి పాల్పడ్డాడు. రీసెంట్‌గా ఓ వ్యక్తి తన దగ్గర కరోనా వ్యాక్సినేషన్ టీకాలున్నాయని సురేష్ బాబు ఆఫీసుకు ఫోన్ చేసాడట. గత కొన్నేళ్లుగా నిర్మాతలు, హీరోలు తమ స్టాఫ్ మెంబర్స్‌కు కరోనా వ్యాక్సిన్(Covid Vaccination) టీకాలు ఇప్పిస్తున్నారు. ఈ కోవలోనే సురేష్ బాబు మేనేజర్ కూడా సదురు మోసగాడు చెప్పిన తీయని మాటలు నమ్మి.. అతను చెప్పిన అకౌంట్‌కు రూ. లక్ష ట్రాన్స్‌ఫర్ చేశారు.

    మనీ ట్రాన్స్‌ఫర్ తర్వాత సదరు వ్యక్తి నుండి ఎలాంటి సమాచారం లేకపోవడంతో సురేష్ బాబు మేనేజర్  అనుమానం వచ్చి టీకాల విషయమై అతనికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయామని ఆలస్యంగా తెలుసుకున్నసురేష్ బాబు మేనేజర్ ఈ విషయమై జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు ఫైల్ చేసుకున్న పోలీసులు సదరు అకౌంట్ వివరాల ఆధారంగా ఆ నిందితుణ్ణి వెతికి పట్టుకునే పనిలో పడ్డారు. రీసెంట్‌గా మహేష్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు, చిరంజీవి, బాలకృష్ణ వంటి వారు తమ స్టాఫ్ మెంబర్స్‌కు టీకాలు వేయించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఒక టీకా డోసు తీసుకున్న వ్యక్తులను షూటింగ్స్‌కు అనుమతిస్తున్న సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: