జగన్ సీఎం కావడంతో.. జాక్పాట్ కొట్టేయబోతున్న సీనియర్ నటి జయసుధ..
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఒకప్పుడు తెలుగు దేశంలో ఎక్కువగా ఉండే సినీ నటుల హడావుడి ఇపుడు వైసీపీలో కూడా మొదలైంది.ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో ఇప్పటి వరకు ఏపీలో ఆయా కార్పోరేషన్లకు టీడీపీ నియమించిన అభ్యర్ధులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఏపీలో ఎఫ్.డి.సి చైర్మన్ గా జయసుధ నియామకం దాదాపు ఖరారైనట్టు సమాచారం.
news18-telugu
Updated: June 2, 2019, 12:35 PM IST

ఏపీ సీఎం జగన్ తో జయసుధ (ఫైల్ ఫోటో)
- News18 Telugu
- Last Updated: June 2, 2019, 12:35 PM IST
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వై.యస్.జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఒకప్పుడు తెలుగు దేశంలో ఎక్కువగా ఉండే సినీ నటుల హడావుడి ఇపుడు వైసీపీలో కూడా మొదలైంది. టీడీపీకి ధీటుగా చాలా మంది నటీనటులు ఎన్నికల ముందు వైసీపీల చేరిన సంగతి తెలిసిందే కదా. అందులో సీనియర్ హీరో మోహన్ బాబుతో పాటు సహజ నటి జయసుధ, రాజశేఖర్ దంపతులతో పాటు అలీ, పృథ్వీ, పోసాని కృష్ణ మురళి వంటి వారు ఉన్నారు. అంతేకాదు ఎన్నికల్లో వారు వైసీపీ తరుపున ప్రచారం నిర్వహించారు. తాము మద్దతు ఇచ్చిన వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయా సినీ నటులు తమకు కీలక పదవులు దక్కుతాయనే ఆశలో ఉన్నారు.

జయసుధ (ఫేస్బుక్ ఫోటో)
ఏపీలో మద్యం కొత్త రేట్లు ఇవే... నేటి నుంచే అమల్లోకి...
అమరావతిలో మహిళా ఉద్యోగుల బెంబేలు... భద్రత, రవాణా సదుపాయం కోసం విజ్ఞప్తి..
ఏపీలో 2020లో ప్రభుత్వ సెలవులు ఇవే...
బ్రాండ్ మీరు చెబితే.. బ్రాండింగ్ నేను చేస్తా... పవన్ కళ్యాణ్
పవన్ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ సపోర్ట్...
వైసీపీ ఎంపీ ఇంటిపై రాళ్ల దాడి, అద్దాలు ధ్వంసం
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో ఇప్పటి వరకు ఏపీలో ఆయా కార్పోరేషన్లకు టీడీపీ నియమించిన అభ్యర్ధులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్గా వ్యవహరించిన అంబికా కృష్ణ తన పదవికీ రాజీనామా చేసారు. అంబికా కృష్ణ ఖాళీ చేసిన ఎఫ్.డి.సి చైర్మన్ పదవిపై వైసీపీలో ఉన్న సినీ నటులు పోటీ పడుతున్నారు. ఐతే జగన్ మాత్రం ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ పదవికి జయసుధ అయితే బావుంటుందని ఆలోచనలో ఉన్నట్టు టాక్. సినీ నటిగా జయసుధకు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరితో సత్సంబందాలున్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి జయసుధ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడనుంది. మరోవైపు టీటీడీ అధ్యక్షపదవి కోసం మోహన్ బాబు ఆయన వంతు ప్రయత్నాలు మొదులు పెట్టారు.
Loading...
Loading...