చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లను వేధిస్తున్న సమస్య..

ఒకవైపు యంగ్ హీరోలకు ధీటుగా సీనియర్ కథానాయకలు కొత్త సినిమాలు చేస్తున్నారు. యంగ్ హీరోలకు దొరికినట్టు ఈ సీనియర్ కథానాయకులకు ...వాళ్ల ఏజ్ తగ్గ హీరోయిన్లు దొరకడం కష్టమైపోయింది.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: February 4, 2019, 8:42 PM IST
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లను వేధిస్తున్న సమస్య..
చిరంజీవి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్,
  • Share this:
ఒకవైపు యంగ్ హీరోలకు ధీటుగా సీనియర్ కథానాయకలు కొత్త సినిమాలు చేస్తున్నారు. యంగ్ హీరోలకు దొరికినట్టు ఈ సీనియర్ కథానాయకులకు ...వాళ్ల ఏజ్ తగ్గ హీరోయిన్లు దొరకడం కష్టమైపోయింది. ఇప్పటికే చిరంజీవి...‘సైరా...నరసింహారెడ్డి’’ చిత్రం కోసం  నయనతారనే హీరోయిన్‌గా తీసుకున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిటైయ్యాడు. ఈ సినిమాలో చిరు సరసన నటించే హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. ఈ సినిమాలో కూడా నయనతార లేదా అనుష్కను తీసుకునే అవకాశాలైతే మెండుగా ఉన్నాయి. లేకపోతే చిరు సరసన కొత్తగా వేరే భామను తీసుకొస్తరా అనేది చూడాలి.

మరోవైపు త్వరలో పట్టాలెక్కున్న బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనేది చూడాలి. మరోపక్క వెంకటేష్, నాగచైతన్యలు హీరోలుగా నటిస్తున్న ‘వెంకీమామ’ సినిమాలో వెంకటేష్ సరసన నటించే కథానాయిక కోసం వేట మొదలుపెట్టారు. ఆల్రెడీ ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేస్తోంది. మరోవైపు వెంకటేష్ సరసన హ్యూమా ఖురేషీని అనుకుంటున్నారు. ఫైనల్‌గా ఎవరు నటిస్తారో చూడాలి.

మరోవైపు నాగార్జున హీరోగా చి.ల.సౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కే ‘మన్మథుడు 2’ సీక్వెల్‌లో నాగ్ సరసన ఎవరు హీరోయిన్‌గా నటిస్తారా అనేది చూడాలి. మొత్తానికి సీనియర్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తోన్న అందుకు తగ్గ భామలు మాత్రం అంత ఈజీగా దొరకడం లేదు.

శృతి హాసన్ ఫోటోస్ 
ఇవి కూడా చదవండి

#HappyBirthDay: ఇంతకీ ‘శృతిహాసన్’ జాడ ఏది..
Loading...
‘ఎఫ్2’ 15 రోజుల క‌లెక్ష‌న్లు.. ఎన్ని కోట్ల లాభాలో తెలుసా..?

మోహ‌న్ లాల్‌కు ఘోర అవమానం.. పద్మభూషణ్‌పై ట్రోలింగ్..

 
First published: February 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...