వెంకీ మామతో నాగ చైతన్యను ఈ రకంగా ఎపుడైనా చూసారా..

గత కొన్నేళ్లుగా హీరోగా సరైన సక్సెస్‌లేని వెంకటేష్.. ఈ యేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘ఎఫ్ 2’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.తాజాగా వెంకటేష్ ..నాగచైతన్యతో బాబీ (కే.యస్.రవీంద్ర)దర్శకత్వంలో ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు. ఈ గురువారం వెంకటేశ్ తండ్రిగారైన ప్రముఖ నిర్మాత డి.రామా నాయుడు జయంతి. ఈ సందర్భంగా వెంకటేస్.. మేనల్లుడు నాగచైతన్య,తండ్రి రామా నాయుడుతో వున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసాడు.

news18-telugu
Updated: June 6, 2019, 5:39 PM IST
వెంకీ మామతో నాగ చైతన్యను ఈ రకంగా ఎపుడైనా చూసారా..
తండ్రి రామానాయుడు,మేనల్లుడు నాగ చైతన్యతో వెంకటేష్
news18-telugu
Updated: June 6, 2019, 5:39 PM IST
గత కొన్నేళ్లుగా హీరోగా సరైన సక్సెస్‌లేని వెంకటేష్.. ఈ యేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘ఎఫ్ 2’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో వెంకీ మరోసారి వార్తల్లో నిలిచాడు. ‘ఎఫ్ 2’ సక్సెస్‌తో వెంకటేష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా వెంకటేష్ ..నాగచైతన్యతో బాబీ (కే.యస్.రవీంద్ర)దర్శకత్వంలో ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు. ‘ప్రేమమ్’లో మేనల్లుడు నాగ చైతన్యతో కాసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న వెంకటేష్..‘వెంకీ మామ’లో పూర్తి స్థాయిలో చైతూతో కలిసి నటిస్తున్నాడు. కాగా ఈ గురువారం వెంకటేశ్ తండ్రిగారైన ప్రముఖ నిర్మాత డి.రామా నాయుడు జయంతి. ఈ సందర్భంగా వెంకటేస్.. మేనల్లుడు నాగచైతన్య,తండ్రి రామా నాయుడుతో వున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసాడు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. చిన్నపుడు చైతూకు కేక్ తినిపిస్తున్న ఫోటోలో రామా నాయుడు కూడా ఉన్నాడు. మీరు మాతో ఉంటే చాలు. మీ కలను మేము నిజం చేస్తాం నాన్న. మిమ్మల్ని కోల్పోవడమే మాకు అతి పెద్దలోటు అంటూ తన తండ్రి రామనాయుడుకు హ్యాపీ బర్త్ డేను ఒకింత ఉద్విగ్నంగా చెప్పారు. 
Loading...

View this post on Instagram
 

You are with us more than ever Nanna as we make your dream come true. Miss you more than ever too. Happy Birthday! #HBDDRN . #VenkyMama


A post shared by Venkatesh Daggubati (@venkateshdaggubati) on


ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై సురేష్ బాబు నిర్మిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యం,ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌తో  ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. మరీ నిజమైన ఈ మామ అల్లుల్లు వెండితెరపై మామ, మేనల్లుడిగా ఎలా అలరిస్తారో చూడాలి.
First published: June 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...