TOLLYWOOD SENIOR HERO RAJASEKHAR SOLD HIS TWO HOUSES IN CHENNAI AND HERE THE REASON PK
Rajasekhar: ఒకప్పటి స్టార్ హీరో రాజశేఖర్ అన్ని కష్టాలు పడ్డాడా.. పాపం ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక..
రాజశేఖర్ ఫైల్ ఫోటో (Source: Facebook)
Rajasekhar: తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకున్న హీరో రాజశేఖర్. ఇప్పుడంటే ఆయనకు మార్కెట్ లేదు కానీ 20 ఏళ్ల కింద చాలా సంచలనాలు సృష్టించాడు. వరస విజయాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసాడు.
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకున్న హీరో రాజశేఖర్. ఇప్పుడంటే ఆయనకు మార్కెట్ లేదు కానీ 20 ఏళ్ల కింద చాలా సంచలనాలు సృష్టించాడు. వరస విజయాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసాడు. 35 ఏళ్ల కింద ఇండస్ట్రీకి వచ్చిన ఈ హీరో.. అంకుశం, ఆవేశం, ఆహుతి లాంటి సినిమాలతో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఒకప్పుడు తెలుగులో భారీ పారితోషికం అందుకున్న హీరోల్లో రాజశేఖర్ కూడా ఉన్నాడు. 90ల్లో ఈయన సినిమాలు వస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోయేది. చిరంజీవి లాంటి హీరోలతో కూడా రాజశేఖర్ పోటీ పడిన సందర్భాలున్నాయి. అన్న, అల్లరి ప్రియుడు లాంటి ఎన్నో సంచలన సినిమాల్లో నటించాడు రాజశేఖర్. మిలినియం మొదట్లో కూడా మనసున్న మారాజు, మా అన్నయ్య లాంటి విజయవంతమైన సినిమాల్లో నటించాడు. అయితే ఓ దశలో రాజశేఖర్‌కు వరస ఫ్లాపులు వచ్చాయి. కనీసం ఆయన సినిమాలు వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియదు. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఫేడవుట్ అయిపోయాడు ఈ సీనియర్ హీరో. దానికితోడు సొంత సినిమాలు చేసి చేతులు కూడా కాల్చుకున్నాడు రాజశేఖర్.
జీవిత రాజశేఖర్ (File/Photo)
దాంతో పూర్తిగా అప్పుల బాధల్లో కూరుకుపోయాడని సన్నిహితులు చెప్తుంటారు. ఈయన ఒకప్పుడు ఎంత భారీగా పారితోషికం తీసుకున్నా కూడా నిర్మాతగా మారి చాలా వరకు పోగొట్టుకున్నాడు. గడ్డం గ్యాంగ్ లాంటి సినిమాలు ఎప్పుడొచ్చి వెళ్లిపోయాయో కూడా తెలియదు. అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి ఈయన కెరీర్లో. మధ్య మధ్యలో ఎవడైతే నాకేంటి, గోరింటాకు, గరుడవేగ లాంటి సినిమాలతో ఉనికి చాటుకున్నా అవి తన అప్పుల్లోంచి మాత్రం బయటపడేలా చేయలేకపోయాయి. ఈ క్రమంలోనే చెన్నైలోని ఆయన రెండు ఇళ్లను కూడా రాజశేఖర్ అమ్ముకున్నాడని అప్పట్లో బాగానే ప్రచారం జరిగింది.
రాజశేఖర్ ఫైల్ ఫోటో
ఇదే విషయాన్ని ఈ మధ్యే తన సన్నిహితులతో చెప్పుకుని రాజశేఖర్ బాధ పడ్డాడని తెలుస్తుంది. ఈ మధ్యే కరోనా నుంచి బయటపడిన ఈయన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన పాత ఇళ్లను అమ్ముకోవడం గురించి.. అప్పుల్లో నుంచి తానెలా బయటపడి మళ్లీ నిలబడ్డాననే సంగతులు తన వాళ్లకు రాజశేఖర్ చెప్పుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా పడినా లేవడం అనేది గొప్ప విషయం. అందులో రాజశేఖర్ నిజంగానే గొప్ప.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.