సినిమాల విషయంలో నాగార్జున సూపర్ స్ట్రాటజీ.. కారణం అదేనా..

అక్కినేని నాగార్జున (పాత చిత్రం)

అవును నాగార్జున ఇపుడు కథల విషయంలో కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఇంతకీ వివారాల్లోకి వెళితే..

  • Share this:
అవును నాగార్జున ఇపుడు కథల విషయంలో కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఇంతకీ వివారాల్లోకి వెళితే..కొత్త కథలతో కుస్తీ పట్టడం కంటే తను యాక్ట్ చేసిన పాత సినిమా కథలనే  అటూ ఇటూ తిప్పి సీక్వెల్స్ తీయాలనుకుంటున్నాడు. ఇప్పటికే తన పాత సూపర్ హిట్..‘మన్మథుడు’ సినిమాకు సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను ఈ నెల 25న పూజా కార్యక్రమాలతో పట్టాలెక్కనుంది. ఈ  సినిమాలో నాగార్జున సరసన రకుల్  ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు నాగార్జునకు సుధీర్ఘ కాలం తర్వాత ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడు. ఈ సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజు ప్లాన్ చేస్తున్నారు.కళ్యాణ్ కృష్ణ తెరకెక్కే  ఈ సినిమాలో నాగ చైతన్య..నాగార్జునకు మనవడిగా నటించబోతున్నాడు. ఇంకోవైపు నాగార్జున ‘రాజు గారి గది’ మూవీ మూడో సీక్వెల్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం.

ఇప్పటికే ఓంకార్..నాగార్జునను కలిసి  రాజుగారి గది 3 సినిమాకు సంబంధించిన కథను నేరేట్ చేసినట్టు సమాచారం. తొందర్లనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడడమే తరువాయి. మొత్తానికి నాగార్జున కొత్త కథలతో రిస్క్ చేయడం కంటే తన పాత సూపర్ హిట్ స్టోరీలకు సీక్వెల్స్ చేస్తున్నాడనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

 
First published: