హోమ్ /వార్తలు /సినిమా /

Nagarjuna - Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు షాక్.. ‘లవ్ స్టోరి’ సక్సెస్ మీట్‌లో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు..

Nagarjuna - Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు షాక్.. ‘లవ్ స్టోరి’ సక్సెస్ మీట్‌లో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు..

నాగార్జున పవన్ కళ్యాణ్ (Nagarjuna Pawan Kalyan)

నాగార్జున పవన్ కళ్యాణ్ (Nagarjuna Pawan Kalyan)

Nagarjuna - Pawan Kalyan: మొన్న రిపబ్లిక్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ (Nagarjuna - Pawan Kalyan) మాట్లాడినప్పటి నుంచి ఇండస్ట్రీ రెండుగా చీలిపోయినట్లు తెలుస్తుంది. ఈ వాదనలో పవన్‌తో ఏకీభవించే వాళ్లు ఎందరు.. ఆయన వాదనతో వ్యతిరేకించే వాళ్లు ఎంతమంది అనేది త్వరలోనే తేలుతుందనే ప్రచారం కూడా సాగుతోంది.

ఇంకా చదవండి ...

సినిమా టికెట్లను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ప్రభుత్వమే అమ్మాలనే ప్రతిపాదనను పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఏపీ ప్రభుత్వం, ఓ మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత ఏపీ ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్‌కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఈ వ్యవహారం కాస్త పవన్ కళ్యాణ్ వర్సెస్ పోసాని కృష్ణమురళి అన్నట్టుగా మారిపోయింది. పవన్ కళ్యాణ్‌పై పోసాని కృష్ణమురళి చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కొందరు మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలతో సంబంధం లేదని ప్రకటిస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ప్రకటించింది. దీంతో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా టాలీవుడ్ చీలిపోయే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది.

పవన్ కళ్యాణ్ వాదనలో ఏకీభవించే వాళ్లు ఎందరు.. ఆయన వాదనతో వ్యతిరేకించే వాళ్లు ఎంతమంది అనేది త్వరలోనే తేలుతుందనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఈ వ్యవహారంపై టాలీవుడ్‌కు చెందిన ప్రముఖలు, పెద్ద నిర్మాతలు మాత్రం నోరు విప్పడం లేదు. ఎవరికి అనుకూలంగా మాట్లాడితే.. ఆ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో అనే ఆందోళన వీరిలో ఉంది. అందుకే ఈ వ్యవహారంపై సైలెంట్‌గా ఉండటమే మంచిదనే భావనలో ఎక్కువమంది సినీ పెద్దలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అగ్ర హీరో, నిర్మాత అయిన నాగార్జున పరోక్షంగా ఏపీ ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించారు.

Nagarjuna comments on KCR YS Jagan: పవన్ కళ్యాణ్ తర్వాత KCR, జగన్‌పై నాగార్జున కీలక వ్యాఖ్యలు..


లవ్ స్టోరీ మూవీ సక్సెస్ మీట్‌లో పాల్గొన్న నాగార్జున.. సినిమా సక్సెస్‌ సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయన కీలక విజ్ఞప్తి చేశారు. తెలుగు ప్రేక్షకులు సినిమాను ఎంతో ప్రేమిస్తారని వ్యాఖ్యానించిన నాగార్జున.. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల దీవెనలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరమని అన్నారు. రెండు ప్రభుత్వాలు ఇప్పటి వరకు తమకు ఎంతగానో సహకరించాయని తెలిపారు. భవిష్యత్తులోనూ వారి చల్లని చూపు కొనసాగాలని నాగార్జున కోరారు. నాగార్జున వ్యాఖ్యలను బట్టి ఆయన కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు దూరంగా ఉన్నారని.. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేయడానికే మొగ్గు చూపారని అర్థమవుతోంది.

First published:

Tags: Akkineni nagarjuna, Pawan kalyan, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు