• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TOLLYWOOD SENIOR HERO MOHAN BABU ANNOUCED NEW MOVIE SON OF INDIA ON EVE OF INDEPENDENCE DAY TA

‘సన్ ఆఫ్ ఇండియా’గా మోహన్ బాబు.. కొత్త మూవీ ప్రకటించిన కలెక్షన్ కింగ్..

‘సన్ ఆఫ్ ఇండియా’గా మోహన్ బాబు.. కొత్త మూవీ ప్రకటించిన కలెక్షన్ కింగ్..

‘సన్నాఫ్ ఇండియా’ మూవీని అనౌన్స్ చేసిన మోహన్ బాబు (Twitter/Photo)

మోహన్ బాబు గత కొన్నేళ్లుగా తాను చేసే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాజాగా 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేసారు.

  • Share this:
    మోహన్ బాబు గత కొన్నేళ్లుగా తాను చేసే సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ‘గాయత్రి’ మూవీ తర్వాత మోహన్ బాబు మరోసారి హీరోగా నటించలేదు. ఆ తర్వాత ‘మహానటి’ లో ఎస్వీఆర్ పాత్రలో నటించారు. ఇపుడు సూర్య హీరోగా నటిస్తోన్న ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో నటిస్తున్నారు.ఈ చిత్రంలో మోహన్ బాబు ఎయర్‌ఫోర్స్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఆ సంగతి పక్కనపెడితే.. మోహన్ బాబు 74వ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమాను ప్రకటించారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాటల రచయత  డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

    ‘సన్ ఆఫ్ ఇండియా’ అనే టైటిల్‌ను బట్టి చూస్తుంటే.. ఇది దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం అనే విషయం స్పష్టమవుతోంది. మొత్తంగా తన చిత్రానికి సంబంధించిన విషయాన్ని పంచుకోవడానికి ఇంత కన్న మంచి తరుణం మించినది లేదన్నట్టు మోహన్ బాబు ఈ చిత్రాన్ని ప్రకటించడం విశేషం. ఈ సినిమాలో ఇంకెవరు నటిస్తున్నారనేది మాత్రం ఇంకా స్పష్టం చేయలేదు. మొత్తంగా స్వాతంత్య్ర దినోత్సవ కానుకంగా అభిమానులకు మోహన్ బాబు మంచి బహుమతే ఇచ్చాడనే చెప్పాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు