మళ్లీ విలన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్న మోహన్ బాబు..

తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చి..ఆ తర్వాత విలన్‌గా టర్న్ తీసుకొని..ఆపై కమెడియన్‌గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన నటుల్లో మోహన్ బాబు ఒకరు. గత కొన్నేళ్లుగా హీరోగా మోహన్ బాబు కెరీర్ ఏమంత బాగోలేదు. తాజాగా మోహన్ బాబు తమిళ్‌లో ఒక స్టార్ హీరో సినిమాలో విలన్‌గా నటించడానికి ఓకే చెప్పాడట.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 7, 2019, 12:33 PM IST
మళ్లీ విలన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్న మోహన్ బాబు..
సినీ నటుడు మోహన్ బాబు(ఫైల్ ఫోటో)
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 7, 2019, 12:33 PM IST
తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చి..ఆ తర్వాత విలన్‌గా టర్న్ తీసుకొని..ఆపై కమెడియన్‌గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన నటుల్లో మోహన్ బాబు ఒకరు. గత కొన్నేళ్లుగా హీరోగా మోహన్ బాబు కెరీర్ ఏమంత బాగోలేదు. గతేడాది ఈ నటప్రపూర్ణుడు కథానాయకుడిగా నటించిన ‘గాయత్రి’ మూవీ రిలీజైన సంగతే ఆడియన్స్‌కు తెలియదు.ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ మూవీలో ఎస్వీఆర్ పాత్రలో నటించి మెప్పించారు. ఐనా ఈ మూవీ సక్సెస్‌ క్రెడిట్ మాత్రం మోహన్ బాబుకు దక్కలేదు. ప్రస్తుతం ఈ కలెక్షన్ కింగ్ ఒక తమిళ సినిమాకు సైన్ చేసినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

అది కూడా సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కే మూవీలో మోహన్ బాబు పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.  ఆల్రెడీ సుధ కొంగర తమిళంలో తెరకెక్కించిన ‘ఇరుదు సుట్రు’ మూవీని హిందీలో మాధవన్‌తో ‘సాలా ఖడూస్’గా తెరకెక్కించి మంచి మార్కులే కొట్టేశింది. ఆ తర్వాత అదే సినిమాను తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘గురు’ టైటిల్‌తో రీమేక్ చేసి మంచి సక్సెసే అందుకుంది.

Mohan Babu accepted Power full Vilan Role in Suriya Movie, తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చి..ఆ తర్వాత విలన్‌గా టర్న్ తీసుకొని..ఆపై కమెడియన్‌గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన నటుల్లో మోహన్ బాబు ఒకరు. గత కొన్నేళ్లుగా హీరోగా మోహన్ బాబు కెరీర్ ఏమంత బాగోలేదు. తాజాగా మోహన్ బాబు తమిళ్‌లో ఒక స్టార్ హీరో సినిమాలో విలన్‌గా నటించడానికి ఓకే చెప్పాడట. Mohan Babu, Mohan Babu vilan, Mohan babu vilan Role in suriya Movie, Mohan babu accepted vilan Role in sudha kongara Suriya tamil movie, mohan babu sudha kongara Suriya, Mohan babu twitter, suriya twitter, Kollywood news, Tollywood news, మోహన్ బాబు, విలన్ గా నటిస్తోన్న మోహన్ బాబు, సూర్య సినిమాలో విలన్ గా మోహన్ బాబు, మోహన్ బాబు సుద కొంగ డైరెక్షన్స్ సూర్య హీరో, సూర్య సినిమాలో విలన్ గా మోహన్ బాబు, కోలీవుడ్ న్యూస్, టాలీవుడ్ న్యూస్,
మోహన్ బాబు, సుధ కొంగర


తెలుగమ్మాయి అయిన సుధ కొంగర...త్వరలో సూర్యతో తెరకెక్కించబోయే సినిమాలో బలమైన విలన్ మాత్రం కోసం మోహన్ బాబును తీసుకోవాలని ఫిక్స్ అయిందంట. ఆల్రెడీ కథ రాసుకున్నపుడు ఈసినిమాలో అతి ముఖ్యమైన పాత్రను మోహన్ బాబు చేస్తే బాగుంటుందని అనుకుందట. ఇదే విషయాన్ని సూర్యకు కూడా చెప్పిందట. దానికి సూర్య కూడా ఈ పాత్ర మోహన్ బాబు అయితే బాగుంటుందని చెప్పాడట.Mohan Babu accepted Power full Vilan Role in Suriya Movie, తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చి..ఆ తర్వాత విలన్‌గా టర్న్ తీసుకొని..ఆపై కమెడియన్‌గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన నటుల్లో మోహన్ బాబు ఒకరు. గత కొన్నేళ్లుగా హీరోగా మోహన్ బాబు కెరీర్ ఏమంత బాగోలేదు. తాజాగా మోహన్ బాబు తమిళ్‌లో ఒక స్టార్ హీరో సినిమాలో విలన్‌గా నటించడానికి ఓకే చెప్పాడట. Mohan Babu, Mohan Babu vilan, Mohan babu vilan Role in suriya Movie, Mohan babu accepted vilan Role in sudha kongara Suriya tamil movie, mohan babu sudha kongara Suriya, Mohan babu twitter, suriya twitter, Kollywood news, Tollywood news, మోహన్ బాబు, విలన్ గా నటిస్తోన్న మోహన్ బాబు, సూర్య సినిమాలో విలన్ గా మోహన్ బాబు, మోహన్ బాబు సుద కొంగ డైరెక్షన్స్ సూర్య హీరో, సూర్య సినిమాలో విలన్ గా మోహన్ బాబు, కోలీవుడ్ న్యూస్, టాలీవుడ్ న్యూస్,
సూర్య, మోహన్ బాబు


రీసెంట్‌గా సుధ కొంగర..మోహన్ బాబును కలిసి ఈ సినిమా స్టోరీ వినిపించింది. దానికీ నట ప్రపూర్ణుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెన్నై ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి చాలా రోజుల తర్వాత విలన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్న మోహన్ బాబు ఈ సినిమాతో ఎలాంటి విలనిజయం చూపెడతాడో చూడాలి.

 
First published: March 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...