తగ్గుతున్న జగ్గూభాయ్ ఆఫర్లు .. కారణాలు అవేనా..

ఒక‌ప్పుడు జ‌గ‌ప‌తిబాబు అంటే ఫ్యామిలీ హీరో. శోభ‌న్ బాబు త‌ర్వాత ఆ రేంజ్‌లో మహిళ ప్రేక్షకాదరణ పొందిన నటుడు. తాజాగా జగపతి బాబుకు టాలీవుడ్‌లో ఆఫర్లు తగ్గడం హాట్‌ టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: December 19, 2019, 11:06 AM IST
తగ్గుతున్న జగ్గూభాయ్ ఆఫర్లు .. కారణాలు అవేనా..
జగపతిబాబు ఫైల్ ఫోటో
  • Share this:
ఒక‌ప్పుడు జ‌గ‌ప‌తిబాబు అంటే ఫ్యామిలీ హీరో. శోభ‌న్ బాబు త‌ర్వాత ఆ రేంజ్‌లో మహిళ ప్రేక్షకాదరణ పొందిన నటుడు. మ‌ధ్య‌లో కొన్ని మాస్ సినిమాలు చేసినా..ప్రేక్షకులు ఎపుడు ఆయన్ని క్లాస్ సినిమాల‌ు చేస్తేనే చూడడానికి ఇష్టపడ్డారు. ఐతే కెరీర్ లో ఒడిదుడుకులు సహజం అలాంటిది ఒక్కసారిగా కోట్ల రేంజ్ నుంచి హీరోగా లక్షల్లోకి పడిపోయి.. అసలు సినిమాలు చేయాలా వద్దా అనుకుంటున్న తరుణంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన'లెజెండ్' సినిమాలో విలన్ చేసి నటుడిగా మళ్లీ ఊపిరి పీల్చుకున్నాడు జగపతిబాబు. 'లెజెండ్' తర్వాత  ‘రంగ‌స్థ‌లం’లో జ‌గ‌ప‌తిబాబు చేసిన విలనీ కారెక్ట‌ర్ కు సూప‌ర్ రెస్పాన్స్ వచ్చింది. గత ఐదారేళ్లుగా చేతినిండా సినిమాలతో రచ్చ చేసాడు జగ్గూ భాయ్ . తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల, కన్న‌డ ఇలా అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ జగ్గూ భాయ్ తన యాక్టింగ్‌తో రఫ్ఫాడించాడు. ఈ మధ్యే విడుదలైన మెగాస్టార్ చిరంజీవి  ‘సైరా నరసిహారెడ్డి’లో కూడా మంచి రోలే చేసాడు. టాలీవుడ్ స్టైలిష్ విలన్‌గా వరస సినిమాలతో దుమ్మరేపాడు. ఆపై తండ్రి పాత్రలతో పాటు సహాయ నటుడిగానూ సత్తా చాటాడు.అదేంటో తెలియని కానీ రీసెంట్‌గా జగ్గూ భాయ్‌కి అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఆ మధ్య మహేశ్‌బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఓ కీ రోల్‌ కోసం మొదట జగపతిబాబును తీసుకున్నారు. ఆయనపై కొన్ని సీన్స్ కూడా షూట్  చేసారు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ ప్లేసులోకి ప్రకాశ్ రాజ్ వచ్చేశాడు. ఆ విషయమై అప్పట్లో జగపతిబాబు  కాస్త ఇబ్బందిపడుతూనే వివరణ ఇచ్చాడు ఈ స్టైలిష్ విలన్.

Jagapathi Babu Sensational Comments on Women and about his Lady Following pk.. కొంద‌రు మ‌న‌సులో ఏదీ దాచుకోరు. ఏది అనిపిస్తే అది బ‌య‌టికి మాట్లాడేస్తుంటారు. అలాంటి వాళ్ల‌కు ధైర్యం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో జ‌గ‌ప‌తిబాబు కూడా అదేర‌కం మ‌నిషి. ఈయ‌న‌కు ఏద‌నిపిస్తే అది చెప్తాడు.. నాకు సెక్స్ అంటే ఇష్టం అని ఓపెన్ గా ఒప్పుకున్న హీరో ఈయ‌న‌. jagapathi babu,jagapathi babu comments,jagapathi babu age,jagapathi babu twitter,jagapathi babu comments on women,jagapathi babu comments on sex,jagapathi babu chiranjeevi,jagapathi babu tsr tv9 awards,jagapathi babu villain,jagapathi babu lady following,jagapathi babu comments,telugu cinema,జగపతిబాబు,జగపతిబాబు కామెంట్స్,అమ్మాయిలపై జగపతిబాబు కామెంట్స్,లేడీ ఫాలోయింగ్‌పై జగపతిబాబు కామెంట్స్,జగపతిబాబు టిఎస్ఆర్ టివి 9 అవార్డ్స్,జగపతిబాబు చిరంజీవి
తాానాజీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తోన్న జగపతిబాబు


ప్రస్తుతం జగ్గూ భాయ్ కెరీర్ గతంతో పోలిస్తే ఇప్పుడు డిమాండ్ తగ్గిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం జగపతి బాబు హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన ‘తానాజీ’లో ముఖ్యపాత్రలో నటించాడు. మరోవైపు దర్శన్ హీరోగా నటిస్తోన్న ‘రాబర్ట్’లో ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఈ రెండు తప్పించి మరే తెలుగు సినిమాలో ఈ క్రేజీ నటుడు నటించడం లేదు. ఇక మహేష్ బాబు సినిమాకు నో చెప్పడం వల్లే ఈ సినియర్ హీరో తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యాడా.. లేక పర్సనల్‌గానే ఏమైనా బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాడా తెలియాలంటే జగ్గు భాయ్ నోరు విప్పేవరకు వెయిట్ చేయాల్సిందే.

First published: December 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు