సినీ ఇండస్ట్రీలో ఆ రికార్డు ఒక్క నాగార్జునకు మాత్రమే సాధ్యం అయింది..

అవును..టాలీవుడ్ హీరో నాగార్జునకు మాత్రమే ఈ అరుదైన రికార్డు సాధ్యమైంది. ప్రపంచ సినీ చరిత్రలో ఏ హీరోకు ఈ రికార్డు సాధ్యం కాకపోవచ్చు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: November 28, 2019, 8:23 AM IST
సినీ ఇండస్ట్రీలో ఆ రికార్డు ఒక్క నాగార్జునకు మాత్రమే సాధ్యం అయింది..
నాగార్జున అక్కినేని (Instagram/Photo)
  • Share this:
అవును..టాలీవుడ్ హీరో నాగార్జునకు మాత్రమే ఈ అరుదైన రికార్డు సాధ్యమైంది. ప్రపంచ సినీ చరిత్రలో ఏ హీరోకు ఈ రికార్డు సాధ్యం కాకపోవచ్చు. వివరాల్లోకి వెళితే.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే హీరోయిన్.. తండ్రీ కొడుకుల సరసన యాక్ట్ చేయడం చాలా రేర్ అనే చెప్పాలి. తెలుగు,హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలో తండ్రి సరసన నటించిన హీరోయిన్లు చాలా మంది కొడుకుల సరసన నటించారు. ఉదాహరణకు ఎన్టీఆర్ సరసన నటించిన జయసుధ, రతి అగ్నిహోత్రి,రాధలు కొడుకు బాలకృష్ణ సరసన నటించారు. అలాగే అక్కినేని నాగేశ్వర రావు సరసన నటించిన శ్రీదేవి, రాధలతో ఆయన తనయుడైన నాగార్జునకు జోడిగా నటించారు.

Akkineni Nagarjuna Create Unique Record.. Here are the details,అవును..టాలీవుడ్ హీరో నాగార్జునకు మాత్రమే ఈ అరుదైన రికార్డు సాధ్యమైంది. ప్రపంచ సినీ చరిత్రలో ఏ హీరోకు ఈ రికార్డు సాధ్యం కాకపోవచ్చు. వివరాల్లోకి వెళితే..,nagarjuna,nagarjuna akkineni twitter,Naga chaitanya,naga chaitanya akkineni twitter,nagarjuna naga chaitanya,ngarjuna akkineni Nageswara Rao,nagarjuna naga chaitanya rakul preeth singh,anr nagarjuna naga chaitanya,naga chaitanya samantha,samantha akkineni,samantha akkineni twitter,samantha akkineni instagram,samantha akkineni tirumalam,naga chaitanya samantha majili,nagarjuna amala,nagarjuna manmadhudu 2,Tollywood News,krishna vijaya nirmala,rajasekhar jeevitha,pawan kalyan renu desai,mahesh babu namrata,srikanth ooha,Telugu cinema,andhra pradesh news,Majini movie Review,Majili movie pramotions,నాగార్జున,నాగార్జున ట్విట్టర్,నాగ చైతన్య,నాగ చైతన్య ట్విట్టర్,నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు,నాగార్జున ఏఎన్నాఆర్ నాగ చైతన్య, నాగార్జున నాగ చైతన్య,నాగ చైతన్య సమంత మజిలీ,నాగ చైతన్య సమంత మజిలీ మూవీ ప్రమోషన్స్,నాగార్జున అమల,టాలీవుడ్ న్యూస్,కృష్ణ విజయ నిర్మల,పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్,మహేష్ బాబు నమ్రత,రాజశేఖర్ జీవిత,శ్రీకాంత్ ఊహ,టాలీవుడ్ న్యూస్,ఏపీ న్యూస్,తెలుగు సినిమా,మజిలీ మూవీ ప్రమోషన్స్,మజిలీ మూవీ రివ్యూ,
ఏఎన్నాఆర్,నాగార్జున సరసన నటించిన శ్రీదేవి


ఇక నాగార్జున విషయానికొస్తే..తండ్రి ఏఎన్నాఆర్ సరసన నటించిన హీరోయిన్స్‌తో పాటు కొడుకు నాగ చైతన్యకు జోడిగా నటించిన లావణ్య త్రిపాఠితో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా చేసాడు. అంతేకాదు చైతూ సరసన ‘రారండోయ్ వేడుక చేద్దాం’  సినిమాలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి  ‘మన్మథుడు’ సీక్వెల్‌ ‘మన్మథుడు 2’ లో నాగార్జున  కలిసి నటించిన సంగతి తెలిసిందే కదా.

నాగార్జున, నాగ చైతన్య సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ (Facebook/Photo)


తాజాగా నాగార్జున.. కొత్త దర్శకుడు సాలోమెన్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున .. నాగచైతన్య సరసన ‘దడ’ సినిమాలో నటించిన కాజల్ అగర్వాల్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా కాజల్.. సీనియర్ కథానాయకుల సరసన నటిస్తోంది. తాజాగా ఇపుడు నాగార్జున సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ రకంగా అటు తండ్రి ఏఎన్నాఆర్ సరసన నటించిన హీరోయిన్స్‌తో పాటు..ఇటు తనయుడు నాగ చైతన్యకు జోడిగా నటించిన భామలతో సిల్వర్ స్క్రీన్‌పై జోడిగా నటించిన ఏకైక హీరోగా నాగార్జున రికార్డులకు ఎక్కాడు.

నాగ చైతన్య, నాగార్జున, కాజల్ అగర్వాల్ (Facebook/Photo)


ఇక నాగార్జున తోటి హీరోలైన చిరంజీవి, బాలకృష్ణలు ఈ రికార్డు అందుకోలేదు. ఒకవేళ భవిష్యత్తులో బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సరసన నటించిన భామతో బాలయ్య యాక్ట్ చేస్తే నాగార్జున క్రియేట్ చేసిన రికార్డులో చేరొచ్చు. ఇప్పటి జనరేషన్‌లో ఏ హీరోకు ఈ అరుదైన రికార్డు సాధ్యం కాకపోవచ్చనే చెప్పాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: November 28, 2019, 8:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading