తెలుగు చిత్రసీమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే సీనియర్ నటి జమున మృతి చెందారు. ఆ బాధ నుంచి ఇండస్ట్రీ ఇంకా బయటపడకముందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు దర్శకుడు సాగర్ (70) కన్నుమూశారు (Director Sagar Passed Away). దర్శకుడు సాగర్ (విద్యా సాగర్ రెడ్డి) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలో ఆయన ఆరోగ్యం విషమించడంతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దర్శకుడు సాగర్ రాకాసి లోయ చిత్రంతో డైరెక్టర్‌గా తన సినీ జీవితాన్ని స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత అమ్మదొంగ, స్టూవర్టుపురం దొంగలు, రామసక్కనోడు, ఖైదీ బ్రదర్స్, అన్వేషణ వంటి సినిమాలను తీశారు. సాగర్ దర్శకత్వం వహించిన రామసక్కనోడు చిత్రానికి మూడు నంది అవార్డ్స్ వచ్చాయి. దర్శకుడు సాగర్ ఓ 30 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. తెలుగు ఫిల్మ్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా చేశాడు.
సాగర్ ఏపీలోని మంగళగిరి వద్ద నిడమర్రులో 1952 మార్చి 1 న జన్మించారు. ఇక ఆయన మొదటి సినిమా రాకాసిలోయ 1983లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వెంటనే సుమన్, భాను చందర్ కాంబినేషన్ తో 'డాకు ', ఆ తర్వాత 1989లో భానుచందర్ తో స్టూవర్టుపురం దొంగలు ఇలా వరుసగా సినిమాలు తీస్తూ మంచి విజయాలను అందుకున్నారు. సాగర్ దర్శకత్వం వహించిన కొన్ని ముఖ్యమైన చిత్రాల విషయానికి వస్తే.. ఖైదీ బ్రదర్స్, యాక్షన్ నెం.1, అన్వేషణ, అమ్మదొంగ, రామసక్కనోడు, ఓసి నా మరదలా, స్టూవర్టుపురం దొంగలు,రాకాసి లోయ వంటి చిత్రాలున్నాయి. సాగర్ మృతి పట్ల చిత్రసీమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telugu Cinema News, Tollywood news