టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ దర్శకుడు అనారోగ్యంతో కన్నుమూత..

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా టాలీవుడ్‌లో శోభన్ బాబు, బాలకృష్ణలతో పలు చిత్రాలను తెరకెక్కించిన ఎన్.బి.చక్రవర్తి కన్నుమూసారు.

news18-telugu
Updated: August 7, 2020, 6:05 PM IST
టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ దర్శకుడు అనారోగ్యంతో కన్నుమూత..
దర్శకుడు ఎన్.బి.చక్రవర్తి కన్నుమూత కుడివైపు ఉన్న వ్యక్తి (Photo/BARaju PRO Twitter )
  • Share this:
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు ఉదయమే ప్రముఖ దర్శకుడు, రచయత పరుచూరి వేంకటేశ్వరరావు సతీమణి విజయ లక్ష్మి గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. ఈ సంఘటన మరవక ముందే తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్‌లో శోభన్ బాబు, బాలకృష్ణలతో పాటు పలువురితో పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎన్.బి.చక్రవర్తి అనారోగ్యంతో కన్నుమూసారు. ఈయన శోభన్ బాబు, జయప్రదతో ‘సంపూర్ణ ప్రేమాయణం’ సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణతో ‘కత్తుల కొండయ్య’, ‘నిప్పులాంటి మనిషి’ చిత్రాలను తెరకెక్కించారు. అటు రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్‌లతో ‘కాశ్మోరా’ చిత్రానికి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ ఎన్.బి.చక్రవర్తి మృతిపై టాలీవుడ్ సినీ ప్రముఖలు సంతాపం వ్యక్తం చేస్తూ.. దర్శకుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 7, 2020, 6:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading