TOLLYWOOD SENIOR CINEMATOGRAPER GOPAL REDDY COMMENTS ON RAM GOPAL VARMA IN ALITHO SARADAGA SHOW NR
Ram Gopal Varma - Gopal Reddy: రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలా ఉండేవాడో చెప్పిన గోపాల్ రెడ్డి!
Ram Gopal Varma - Gopal Reddy
Ram Gopal Varma - Gopal Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాత్మక దర్శకుడు,వివాదాస్పద దర్శకుడు అంటే అందరికీ వెంటనే రామ్ గోపాల్ వర్మ గుర్తుకువస్తారు. ఇతని వ్యవహార శైలి,
Ram Gopal Varma - Gopal Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాత్మక దర్శకుడు,వివాదాస్పద దర్శకుడు అంటే అందరికీ వెంటనే రామ్ గోపాల్ వర్మ గుర్తుకువస్తారు. ఇతని వ్యవహార శైలి, ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఎవరికీ ఒక పట్టునా అర్థం కాదు. ఎప్పుడు తనకు తోచినది మాట్లాడుతూ ఎన్నోసార్లు వివాదాలకు కారణమవుతుంటాడు. కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ గా రామ్ గోపాల్ వర్మ ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఎంతో భిన్నంగా వ్యవహరించే రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలా ఉండేవాడు అనే విషయాలను గురించి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి వచ్చిన సినిమాటోగ్రాఫర్ గోపాల్ రెడ్డి తన సినీ ప్రస్థానం గురించి ముచ్చటించారు. గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన శివ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా గోపాల్ రెడ్డి పనిచేశారు. ఈ క్రమంలోనే అలీరామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉండేవాడని ప్రశ్నించగా.. గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అహ నా పెళ్ళంట సినిమా షూటింగ్ సమయంలో గోపాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న సమయంలో రామ్ గోపాల్ వర్మ నేను ప్రతి రోజు వస్తాను నన్ను అసిస్టెంట్ గా అనుకోకండి రెగ్యులర్ గా వచ్చి మిమ్మల్ని అబ్సర్వ్ చేస్తానని చెప్పారు. ఆ విధంగా నాతో ప్రయాణం చేస్తూ నాగార్జున గారు శివ సినిమాకు ఓకే చెప్పారని అందుకు మీరే సినిమాటోగ్రాఫర్ గా పని చేయాలని రాంగోపాల్ వర్మ అడిగినట్లు తెలిపారు. అందుకు గోపాల్ రెడ్డి కూడా సరే అనడంతో వీరి కాంబినేషన్లో శివ సినిమా తెరకెక్కింది.
శివ సినిమా కోసం నాగార్జున, సురేంద్ర, వెంకట్ గారు సినిమాటోగ్రాఫర్ నా కన్నా పెద్ద వారిని తీసుకోవాలని వారు భావించినప్పటికీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ససేమిరా అంటూ అవకాశాన్ని నాకు ఇచ్చారని తెలిపారు. ఇక రామ్ గోపాల్ వర్మ కథ వివరించే సమయంలోనే సినిమా ఫోటోగ్రాఫర్ ని కూడా ఇన్స్పిరేషన్ చేసే విధంగా కథ వినిపించేవారు.శివ సినిమా విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్ వల్లనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందని, తను కథ చెప్పేటప్పుడు ఆ విజువల్ ఎఫెక్ట్ కనిపించేదని ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి రామ్ గోపాల్ వర్మ గురించి వివరించారు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.