TOLLYWOOD SENIOR ANCHOR UDAYA BHANU DEEP CONDOLENCES ON POTTI VEERAIAH DEATH NR
Udaya Bhanu: కొంతైనా దయచూపించు దేవుడా అంటూ కన్నీరు పెట్టుకున్న ఉదయ భాను!
udaya bhanu
Udaya Bhanu: ఒకప్పుడు బుల్లితెరపై యాంకరింగ్ లో మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ ఉదయభాను.. ఇప్పటికీ ఆమెకు ప్రేక్షకుల అభిమానం ఉంది. గలగలా మాట్లాడుతూ మంచి పేరు అందుకుంది.
Udaya Bhanu: ఒకప్పుడు బుల్లితెరపై యాంకరింగ్ లో మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ ఉదయభాను.. ఇప్పటికీ ఆమెకు ప్రేక్షకుల అభిమానం ఉంది. గలగలా మాట్లాడుతూ మంచి పేరు అందుకుంది. ఇక సినిమాలలో కొన్ని పాత్రలలో కూడా మెప్పించింది. అప్పట్లో తన వ్యక్తిగత విషయాల పట్ల వార్తల్లో కూడా నిలిచింది. ఇక సోషల్ మీడియా పట్ల అంతగా ఆసక్తి చూపదు ఉదయభాను.
బుల్లితెర లో ఎన్నో జానపద గేయాలు అందించే కార్యక్రమంలో, చిన్నపిల్లల తో కలిసి ఓ ప్రోగ్రాంలో ఎన్నో డాన్స్ ప్రోగ్రాం లలో యాంకరింగ్ చేసింది. ఇక ఆ తరువాత తన నటనకు, యాంకరింగ్ జీవితానికి దూరం అయ్యింది. ఇక సోషల్ మీడియా పై ఆసక్తి తక్కువగా చూపించిన.. ఎప్పుడో ఒకసారి కొన్ని విషయాల గురించి, బయట జరుగుతున్న అఘాయిత్యాల గురించి స్పందిస్తుంది. ఇక తాజాగా ఒక విషయంలో బాగా ఎమోషనల్ అయ్యింది ఉదయభాను..
ప్రముఖ తెలుగు సినీ నటుడు పొట్టి వీరయ్య మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. గత కొంతకాలం నుండి అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆదివారం రోజు గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచాడు. ఇక ఆయన మరణం గురించి బృందాలు సంతాపం తెలిపారు. ఇక ఉదయభాను కూడా ఆయన మరణ ఈ విషయం గురించి జీర్ణించుకోలేక పోయింది. అంతేకాకుండా తన సోషల్ మీడియా ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ తో అందరినీ కంటతడి పెట్టించింది.
వీరయ్య అంకుల్ మరణవార్త తెలియగానే హృదయం ముక్కలైనట్టు అనిపించిందని, ఇది భరించలేని నిజమంటూ చెప్పడానికి ఎంతో బాధగా ఉంది అని బాధపడింది. ఇప్పుడు కలుగుతున్న బాధను మాటల్లో చెప్పలేకపోతున్నా అంటూ, మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాను అంకుల్. ఎంతో మంచి వ్యక్తి ని ఈ ప్రపంచం కోల్పోయింది. దేవుడా మా మీద కొంచెం అయిన దయచూపు అంటూ బాగా ఎమోషనల్ అయ్యింది ఉదయభాను.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.