హోమ్ /వార్తలు /సినిమా /

Suma Kanakala: క్రూరత్వం కనిపించడం లేదా అంటూ.. సుమను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

Suma Kanakala: క్రూరత్వం కనిపించడం లేదా అంటూ.. సుమను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

Suma Kanakala

Suma Kanakala

Anchor Suma: బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల అంటే తెలియని వారెవ్వరూ లేరు. ఇక ఈమె యాంకరింగ్ చేసే విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మాటలతో అందరిని బాగా ఆకట్టుకుంది.

    Suma Kanakala: బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల అంటే తెలియని వారెవ్వరూ లేరు. ఇక ఈమె యాంకరింగ్ చేసే విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే. తన మాటలతో అందరిని బాగా ఆకట్టుకుంది. వెండితెర లో నటించిన సుమకు అంత క్రేజ్ రాలేకపోయినా బుల్లితెర మాత్రం స్టార్ గా నిలిచింది. ఇక ఆమె వేసే పంచ్ లు మాత్రం బాగా పేలుతాయి. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.


    తీరికలేని బిజీ లైఫ్ గడుపుతున్న సుమ అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇప్పటివరకు తన యాంకరింగ్ విషయంలో కానీ, తన మాటల్లో గాని ఎటువంటి నెగటివ్ ను దరికి రానీయకుండా ముందుకు సాగుతుంది. ఎన్నో సినిమా ఈవెంట్లలో కూడా సుమ కమ్యూనికేషన్ గురించి ఎవరు నెగటివ్ గా మాట్లాడుకోలేదు. కానీ తాజాగా సుమ పై కొందరు ఫైర్ అయ్యారు. అంతేకాకుండా క్రూరత్వం కనిపించలేదా అంటూ ట్రోల్ చేస్తున్నారు.


    సుమ తనకు సంబంధించిన కామిడీ వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులను తెగ పంచుకుంటుంది. అంతేకాకుండా తను ఇంట్లో చేసే అల్లరి పనులను కూడా తెగ షేర్ చేస్తుంది. ఇక ఆమెకు మూగజీవుల అంటే ఇంకా ఇష్టం. అలాంటిది తాజాగా ఆమె పెట్టిన వీడియోలు క్రూరత్వం కనిపించిందని నెటిజనులు మండిపడుతున్నారు. తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో సుమ ఓ ఆవు, దూడ పిల్లతో సమయాన్ని గడిపింది. ఇక దూడ పిల్లను రాముడు అంటూ దగ్గరికి పిలుచుకుంటుంది.










    View this post on Instagram






    A post shared by Suma K (@kanakalasuma)



    కానీ ఆ సమయంలో దూడ మూతికి మాస్క్ లాంటిది పెట్టగా.. అనేక దూడ మూతిని పాలు తాగకుండా అలా కట్టెసారని.. ఎంతటి క్రూరత్వం అది మీకు కనిపించడం లేదా అంటూ సుమ పై ఫైర్ అయ్యారు నెటిజనులు. కానీ కొంతమంది మాత్రం అర్థం చేసుకొని ఆ దూడ పిల్ల ఏది పడితే అది తింటే ఆరోగ్యం చెడిపోతుందని, మించిన స్థాయికంటే ఎక్కువ పాలు తాగుతూ ప్రమాదకరమని కాబట్టి అలా మూతికి అడ్డుకడతారని తెలిపారు. ఇక ఈ విషయాన్ని కొందరు అర్థం చేసుకోక సుమ పై నెగటివ్ కామెంట్స్ చేశారు.

    Published by:Navya Reddy
    First published:

    Tags: Cow video, Instagram, Tollywood, Trolling

    ఉత్తమ కథలు