Vijay Shanthi: తెలుగు సినీ పరిశ్రమలో అప్పటినుండి ఇప్పటివరకు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించిన పాత్రలు ఎంతో ఆసక్తిగా ఉంటాయి. అంతేకాకుండా అప్పట్లో ఈమె కొన్ని డైనమిక్ పాత్రలో కూడా మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ఈమె సినిమాలంటే చాలు అభిమానులు బాగా ఆసక్తి చూపేవాళ్ళు. అంతేకాకుండా అలనాటి తారల లో స్టార్ హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమలో నిలిచింది. ఇక ఇప్పటికీ ఆమె కొన్ని కీలక పాత్రలో నటిస్తునే ఉంది. ఇదిలా ఉంటే ఆమె నటించిన కొన్ని డైనమిక్ పాత్రలతో మంచి గుర్తింపు పొందిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం..
1985లో ఆమె నటించిన ప్రతిఘటన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇందులో ఈమె పాత్ర గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాల్లో ఎంతో ధైర్యం గా కనిపించిన విజయశాంతి.. అందులో క్లైమాక్స్ సన్నివేశంలో తన నటన బాగా ఆకట్టుకుంది. పద్మావతి సంధ్యారాగం అనే సినిమాలో ఒక అమాయకత్వం అమ్మాయిగా ఉంటూ ఆ తర్వాత కథను బట్టి తన ధైర్యం ఏంటో చూపించడంతో ఇందులో తన పాత్ర బాగా ఆకట్టుకుంది.
ఇక స్వయంకృషి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి సరసన నటించిన ఈ సినిమాలో ఎండింగ్ స్క్రిప్టులో ఎంత డైనమిక్ గా నటించింది. ఇక కర్తవ్యం సినిమా లో ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ గా విజయశాంతి కనిపించగా.. ఇందులో సమాజంలో జరిగే వాటిపై బాగా పోరాడింది. ఇక భారతనారి సినిమా లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో తెరకెక్కగా.. ఈ సినిమాలో విజయశాంతి నటనకు అవార్డులు కూడా అందాయి.
1990లో వెంకటేష్ తో కలిసి నటించిన శత్రువు సినిమాల్లో పోలీస్ గెటప్ లో హీరోని మించి నటించింది. ఈ సినిమాలో తన ఫైట్, డేర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఇక ఒసేయ్ రాములమ్మ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా పాట ట్రెండ్ గా ఉండగా.. ఈ సినిమాలో విజయశాంతి పాత్ర అందరినీ బాగా ఆకట్టుకుంది. తను ఎదిరించే ధైర్యం, నటన ఈ సినిమాకు మంచి గుర్తింపును అందించింది.
ఇక మొండి మొగుడు పెంకి పెళ్ళాం సినిమాల్లో విజయశాంతి పాత్ర గురించి అందరికీ తెలిసిందే. హీరో ని డామినేట్ చేసే పాత్రలో బాగా నటించింది. ఇక చిరంజీవి తో గ్యాంగ్ లీడర్ సినిమాలోని నటించిన విజయశాంతి.. ఈ సినిమాలో కాస్త కామెడీతో పాత్రతో బాగా ఆకట్టుకుంది. ఇక ఈ తరం విజయశాంతి నటించి తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇక ఈ సినిమాలో తన పాత్ర ఎంతో హానెస్ట్ గా, ఎంతో సింపుల్ గా చూపించగా.. ఇందులో తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chiranjeevi, Dynamic characters, Karthavyam, Prathi ghatana, Senior actress vijay shanthi, Swayam krushi, Tollywood, విజయశాంతి