Home /News /movies /

NBK - Meena: బాలయ్య కోసం సీనియర్ నటి మీనా.. ఆ సీన్ కోసమే స్పెషల్‌గా?

NBK - Meena: బాలయ్య కోసం సీనియర్ నటి మీనా.. ఆ సీన్ కోసమే స్పెషల్‌గా?

Actress Meena

Actress Meena

Actress Meena: తెలుగు సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి తెలీనోలే లేరు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు.

    NBK - Meena: తెలుగు సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి తెలీనోలే లేరు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అవకాశం వచ్చిందని తెలుస్తుంది.

    ఇక ప్రస్తుతం అఖండ సినిమాల్లో బిజీగా ఉన్నా బాలయ్య.. ఈ సినిమాలో రెండు పాత్రలతో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా టీజర్ విడుదల కాగా నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను మే 28న విడుదల చేయడానికి సినీ బృందం ఇదివరకే ప్రకటించగా.. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమా వాయిదా పడింది.

    ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. యదార్థ ఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. మరో విషయం ఏంటంటే ఈ సినిమాలో కూడా బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కన్పించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఫ్యాక్షనిస్టు, పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ తో పాటు మరో సీనియర్ హీరోయిన్ నటించనుందట.

    బాలయ్య సరసన ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శృతిహాసన్ అని సమాచారం అందగా.. మరో సీనియర్ హీరోయిన్ మీనా ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మీనా బాలయ్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలయ్య జంటగా నటించనున్నట్లు తెలిసింది. ఇక ఈ ప్రాజెక్టు కోసం మీనా ను సంప్రదించగా.. తను కూడా ఓకే అన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయం గురించి ఇప్పటి వరకు సినీ బృందం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Akhanda, Balakrishna, Gopichand, Senior actress meena, Tollywood, అఖండ, నటి మీనా, బాలకృష్ణ, బాలయ్య

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు