Casting Couch: అప్పట్లో మమ్మల్ని కూడా వేధించారు.. సీనియర్ నటి అన్నపూర్ణ సంచలనం..

సీనియర్ నటి అన్నపూర్ణ (actress Annapurna)

Casting Couch: తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. శ్రీ రెడ్డి లాంటి వాళ్లు దీనికి బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉన్నారు. ఎందుకంటే కేవలం శ్రీ రెడ్డి పుణ్యమా అని క్యాస్టింగ్ కౌచ్ అనే పదం మరింత హైలైట్ అయింది.

  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. శ్రీ రెడ్డి లాంటి వాళ్లు దీనికి బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఉన్నారు. ఎందుకంటే కేవలం శ్రీ రెడ్డి పుణ్యమా అని క్యాస్టింగ్ కౌచ్ అనే పదం మరింత హైలైట్ అయింది. ఆ తర్వాత మీటూ ఉద్యమం కూడా బాగానే జరిగింది అది వేరే విషయం. కానీ అప్పట్లో అర్ధనగ్నంగా ఫిలిం ఛాంబర్ ముందు కూర్చోని నానా రచ్చ చేసింది శ్రీ రెడ్డి. దెబ్బకు గల్లీ టూ ఢిల్లీ వరకు ఫేమస్ అయిపోయింది ఈ బ్యూటీ. ఆఫర్స్ కోసం అమ్మాయిలను వేధించే ప్రక్రియకే క్యాస్టింగ్ కౌచ్ అనే పేరు. ఇంకా చెప్పాలంటే అవకాశాల కోసం పడుకోవడం అన్నమాట. పడుకుంటే కానీ ఛాన్సులు రావని తెలుగులో మాధవి లత, శ్రీ రెడ్డి లాంటి వాళ్లు ఇప్పటికే కోడై కూస్తున్నారు.. ఇంకా అదే చెప్తున్నారు. తెలుగులో టాప్ హీరోయిన్స్ జాతకాలన్నీ తనకు తెలుసు అంటూ శ్రీ రెడ్డి పదే పదే అంటూనే ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు కాదు 50 ఏళ్ల కింది నుంచే ఉందని ఇప్పుడు సీనియర్ నటీమణులు చెప్తున్నారు. అలీతో సరదాగా షోకు సరదాగా మాట్లాడడానికి వచ్చిన అన్నపూర్ణ, వై విజయ అప్పుడు తమకు ఎదురైన సంఘటనల గురించి గుర్తు చేసుకున్నారు.
senior actress annapurna,senior actress annapurna y vijaya,senior actress annapurna alitho saradaga,senior actress annapurna gummadi movies,senior actress annapurna movies,telugu cinema,అలీతో సరదాగా,అలీతో సరదాగా అన్నపూర్ణ వై విజయ,తెలుగు సినిమా
సీనియర్ నటి అన్నపూర్ణ (Senior actress Annapurna)

అప్పట్లో కూడా అవకాశాల కోసం వేధించడం ఉండేదని.. కాకపోతే ఈ పేర్లు గట్రా లేవని చెప్పారు వాళ్లు. మాకేంటి.. అంటూ పోకిరీలు మా వెంటే పడేవాళ్లు అంటూ అన్నపూర్ణ చెప్పుకొచ్చింది. అందుకే 20 ఏళ్లకే పెళ్లి చేసుకోవడం.. పాతికేళ్లకే అమ్మ వేషాలు వేయడం మొదలు పెట్టానని చెప్పింది అన్నపూర్ణ. హీరోయిన్‌గా ఛాన్సులు వచ్చినా కూడా రెండు సినిమాలకే ఆపేసింది అన్నపూర్ణ. దానికి కారణం తమను కెలికే వాళ్లు ఎక్కువైపోవడమే అని చెప్పింది ఈమె. అదే అమ్మ వేషాలైతే అలాంటివి ఉండవని.. అప్పుడు కూడా ఉండేవి కానీ ముందుగానే అలాంటి పనులు చేయనంటేనే డేట్స్ ఇచ్చేవాళ్లమని చెప్పింది అన్నపూర్ణ.
senior actress annapurna,senior actress annapurna y vijaya,senior actress annapurna alitho saradaga,senior actress annapurna gummadi movies,senior actress annapurna movies,telugu cinema,అలీతో సరదాగా,అలీతో సరదాగా అన్నపూర్ణ వై విజయ,తెలుగు సినిమా
అలీతో సరదాగా (alitho saradaga show/ETV)

ఇండస్ట్రీలో అలాంటి వాళ్లు ఎప్పుడూ ఉంటారని.. మనమే తప్పించుకోవాలంటూ చెప్పింది వై విజయ. ఈ సీనియర్ నటీమణుల మాటలు బట్టి చూస్తుంటే ఇప్పుడు కాదు కొన్ని దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో ఇది ఉందని అర్థమైపోతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది అయితే కాదు.. ఎప్పట్నుంచో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. దానికి దాచుకుంటూ కొందరు.. దాటుకుంటూ ఇంకొందరు.. లొంగిపోయి మరికొందరు ముందుకొస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: