Annapoorna: సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై సీనియర్ నటి అన్నపూర్ణ సంచలన వ్యాఖ్యలు..

క్యాస్టింగ్ కౌచ్ పై అన్నపూర్ణ సంచలన వ్యాఖ్యలు (File/Photo)

Annapoorna: సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై టాలీవుడ్  సీనియర్ నటి అన్నపూర్ణ (Annapoorna) చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్‌గా మారాయి.

  • Share this:
    Annapoorna: సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై టాలీవుడ్  సీనియర్ నటి అన్నపూర్ణ (Annapoorna) చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్‌గా మారాయి. అన్నపూర్ణమ్మగా విషయానికొస్తే.. ఈమె తెలుగులో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా  తెరకెక్కిన ‘స్వర్గం నరకం’ సినిమాతో హీరోయిన్‌గా పరిచమైంది. అంతకు ముందు ఈమె పలు నాటకాల్లో విభిన్న పాత్రల్లో అలరించింది. అలా నాటాకాల నుంచి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిలైంది.  ముఖ్యంగా తెలుగు హీరోలకు ఈమె పర్మినెంట్ అమ్మగా మారిపోయింది. ఎన్టీఆర్ నుంచి మొదలు పెడితే..  తన ఫస్ట్ హీరో మోహన్ బాబు, బాలకృష్ణ,చిరంజీవి, నాగార్జున, అక్కినేని, కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు, వెంకటేష్ వంటి ఎంతో మంది హీరోలకు తల్లి పాత్రల్లో నటించి టాలీవుడ్ వెండితెర అమ్మగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఈమె. రెండేళ్ల క్రితం విడుదలైన ‘ఎఫ్ 2’లో తమన్నా నాయనమ్మ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇపుడు ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3లో మరోసారి అదే పాత్రలో ప్రేక్షకులను పలకరించింది.  తాజాగా ఈమె ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీలోని  క్యాస్టింగ్ కౌచ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

    సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒకరి వైపు ఉండదని కుండ బద్దలు కొట్టారు అన్నపూర్ణమ్మ. ఇద్దరికి ఇష్టమైతేనే కొన్ని సార్లు అలా తప్పులు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. ఇక నట ప్రస్థానం  నాటకాల నుంచి  ఆరంభం అయిందని పేర్కొన్నారు.  కెరీర్ స్టార్టింగ్‌లోనే ఉమగా ఉన్న తన పేరును అన్నపూర్ణగా మార్చుకున్నాను. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను పనిచేసిన ప్రతి ఒక్క హీరో తనను ఎంతో గౌరవించారు అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అంతేకాదు వాళ్లంత తనతో మర్యాద పూర్వకంగా ఉండేవారన్నారు.

    Tollywood Senior Actress Annapoorna Sensational Comments on Casting Couch,Annapoorna: సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై సీనియర్ నటి అన్నపూర్ణ సంచలన వ్యాఖ్యలు..,Tollywood Senior Actress Annapoorna,Tollywood Mother Annapoorna,Annapurna,Annapoorna On Casting Couch,Annapoorna Movies,Annapoorna Charecter Artist,Tollywood,అన్నపూర్ణమ్మ,అన్పపూర్ణ టాలీవుడ్ సీనియర్ నటి,తెలుగు తెర అమ్మ అన్నపూర్ణ,కాస్టింగ్ కౌచ్ పై అన్నపూర్ణ సంచలన వ్యాఖ్యలు,కాస్టింగ్ కౌచ్‌ పై అన్నపూర్ణ సంచలన వ్యాఖ్యలు
    అన్నపూర్ణమ్మ (File/Photo)


    ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ.. ఇదో అనవసరపు వ్యవహారం అని పేర్కొన్నారు. కేవలం సినీ రంగంలోనే కాదు. ప్రతి రంగంలో మహిళలు ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. కానీ ఇళ్లు, ఫ్యామిలీ, గౌరవం అనే వాటిని దృష్టిలో పెట్టుకొని వేటికి లొంగకుండా మహిళలు ఎంతో నేర్పుగా తప్పించుకుని ఇంటికి వస్తున్నారు. అదే మాదిరి సినిమా వాళ్లు కూడా తప్పించుకుని తిరగాలన్నారు. క్యాస్టింగ్ కౌచ్ అంటే రెండు వైపులా ఆలోచించాలి. ఒకవేళ అలాంటి ఘటనలు జరిగితే వెంటనే మహిళలు స్పందించాలన్నారు. ప్రతి రంగంలో ఏదో కొన్ని తప్పులు జరుగుతుంటాయి. కానీ గ్లామర్ ఫీల్డ్ అయిన సినిమా రంగంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై  ఉంటుంది. అలాగే ఛాన్సుల కోసం ట్రై చేసే వాళ్లు కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని అన్నపూర్ణ అన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: