Actress Aamani: అందగత్తెను కాదన్నారు.. ఇండస్ట్రీలో చాలా అవమానాలు ఎదుర్కొన్న: నటి ఆమని 

Actress Amani

Actress Aamani: తెలుగు సీనియర్ నటి ఆమని గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. జంబలకిడిపంబ సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆమని.. ఆతర్వాత మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం వంటి పలు సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.

  • Share this:
    Actress Aamani: టాలీవుడ్ సీనియర్ నటి ఆమని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. జంబలకిడిపంబ సినిమాతో తొలి సారిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆమని.. ఆతర్వాత మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం వంటి పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. అలాంటి ఈ తన పెళ్లి తర్వాత హీరోయిన్ గా మాత్రమే కాకుండా చిన్న చిన్న పాత్రలలో కూడా నటించింది. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ నటి సహాయ పాత్రలలో మెప్పిస్తుంది. ఇదిలా ఉంటే తనను ఎగతాళి చేశారని.. పెద్ద అందగత్తె కాదు అన్నారని బాధపడింది ఆమని.

    ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా షో గురించి అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదల కాగా.. అందులో ఇంద్రజ, ఆమని పాల్గొన్నారు. ఎంట్రీ తోనే బాగా సందడి చేశారు. ఇక వీరిద్దరు కలిసి నటించిన సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. ఆమని తల్లి ఆమని, తన సోదరుడు ఉండగానే మరో ఇద్దరు అమ్మాయిలను పెంచుకుందని.. తన కంటే ఎక్కువ ప్రేమగా వాళ్లను చూసుకుంటారని తెలిపింది.

    చాలామంది ఆ అమ్మాయిలను చూసి తన కూతుర్లని అనుకున్నారని చెప్పుకొచ్చింది ఆమని. ఇక తనకు ఐదేళ్ల సంవత్సరం నుండి సినిమాలు అంటే పిచ్చి అని ఆ సమయంలోనే శ్రీదేవి, జయసుధలను తలుచుకుంటూ వారిలా ఎప్పుడు నటిస్తానో అని అనుకునేదాన్ని చెప్పుకొచ్చింది. ఇక జంబలకడి పంబ సినిమాలో మగవాళ్ళు ఆడవాళ్ళు ఉండేటట్లు నిజజీవితంలో జరగాలి అని.. అప్పుడే ఎందరో ఆడవాళ్ళ జీవితాలు బాగుంటుంది అంటూ ఫన్నీగా కామెంట్స్ చేసింది.



    తనకు మామిడి పండ్లు దొంగతనం చేసి తినడం అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఇక తనకు సినిమాలలో నటించాలని ఉందని తన కుటుంబ సభ్యులతో చెప్పినప్పుడు చాలా కాంట్రవర్సి జరిగిందని తెలిపింది. ఆమె సినిమాల్లో చేయడమేమిటి.. అంత పెద్ద అందగత్తె కాదు అని ఆమె బంధువులు తనని ఎగతాళి చేశారని బాధపడింది ఆమని. ఇక తనకు అవకాశాలు వచ్చినప్పటికీ చిన్న చిన్న పాత్రలలో నటించనని తెగేసి చెప్పినట్టు చెప్పింది ఆమని. కాగా ప్రస్తుతం సీనియర్ నటి ఆమని జీ తెలుగులో ప్రసారం అవుతున్న ముత్యమంతా ముద్దు సీరియల్ లో డబ్బు ఆశ ఉన్న అత్తగా నటిస్తుంది. మరి ఈ సీరియల్ ఏ స్థాయిలో సూపర్ హిట్ అవుతుందో చూడాలి.
    Published by:Navya Reddy
    First published: