Raja Ravindra: ఇండస్ట్రీలో టీ, కాఫీలు అమ్ముకుని బతుకుతా అంటున్న రాజా రవీంద్ర..

సీనియర్ నటుడు రాజా రవీంద్ర (Raja Ravindra)

Raja Ravindra: ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటులలో రాజా రవీంద్ర (Raja Ravindra) కూడా ముందు వరసలో ఉంటాడు. ఇప్పటి వరకు ఈయన వందల సినిమాలు చేసుంటాడు. 35 ఏళ్ళుగా ఇండస్ట్రీలోనే ఉన్నాడు ఈయన.

  • Share this:
ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటులలో రాజా రవీంద్ర కూడా ముందు వరసలో ఉంటాడు. ఇప్పటి వరకు ఈయన వందల సినిమాలు చేసుంటాడు. 35 ఏళ్ళుగా ఇండస్ట్రీలోనే ఉన్నాడు ఈయన. నటుడిగా వచ్చి.. ఆ తర్వాత మేనేజర్‌గానూ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ నటుడిగా బిజీ అయ్యాడు రాజా రవీంద్ర. ప్రస్తుతం వరస సినిమాలు చేస్తున్నాడు ఈయన. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలే చేస్తున్నాడు రాజా. ఇలాంటి సమయంలో ఈయన ఓ హీరోగా నటించిన సినిమా క్రేజీ అంకుల్స్. ఈ సినిమాలో అతడితో పాటు సింగర్ మనో మరో హీరోగా నటించాడు. ఈ సినిమా ఆగస్ట్ 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు రాజా రవీంద్ర. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు ఈయన. ముఖ్యంగా తన కెరీర్ గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు.

చాలా మందికి కరోనా సమయంలో చాలా ఇబ్బందులు వచ్చాయని.. ఒక్కరికి వైరస్ వచ్చినా కూడా మిగిలిన వాళ్లు కూడా దూరంగా ఉండాల్సి వచ్చేదని గుర్తు చేసుకున్నాడు రాజా రవీంద్ర. అలాంటి సమయంలో కూడా తమ క్రేజీ అంకుల్స్ షూటింగ్ పూర్తి చేసామని చెప్పాడు రాజా. చాలా వేగంగా ఈ సినిమాను పూర్తి చేశామని తెలిపాడు ఈ నటుడు. ఈ సినిమాను ముందు ఓటీటీకి ఇచ్చేద్దామనుకున్నా కూడా థియేటర్‌కు వస్తేనే బాగుంటుందని నిర్ణయం మార్చుకున్నట్లు చెప్పాడు రాజా. ఈ సినిమాలో పోసాని కారెక్టర్ అద్భుతంగా ఉంటుందంటున్నాడు రాజా రవీంద్ర.
actor raja ravindra,actor raja ravindra twitter,actor raja ravindra instagram,actor raja ravindra movies,actor raja ravindra crazy uncles movie,actor raja ravindra sreemukhi,యాంకర్ శ్రీముఖి,సీనియర్ నటుడు రాజా రవీంద్ర,సీనియర్ నటుడు రాజా రవీంద్ర టీ కాఫీలు అమ్ముకుంటా
సీనియర్ నటుడు రాజా రవీంద్ర (Raja Ravindra)

తనకు సినిమా అంటే పిచ్చి అని.. ఒకవేళ సినిమా అవకాశాలు లేకపోతే.. ఆర్టిస్టులకు, టెక్నిషియన్లకు కాఫీ, టీ ఇచ్చుకుంటూ ఇక్కడే బతుకుతానని ఎన్నోసార్లు చెప్పాడు ఈ నటుడు. ఇప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నాడు. తన దగ్గరికి వచ్చే ప్రతీ అవకాశం అందిపుచ్చుకోడానికే ప్రయత్నిస్తానంటున్నాడు రాజా రవీంద్ర. ప్రత్యేకంగా ఇలాంటి పాత్రలు చేయాలని ఏం పెట్టుకోను అంటున్నాడు ఈయన. ఓటీటీ రావడం వల్ల అవకాశాలు ఇంకా పెరిగాయని.. పారితోషికం కూడా బాగానే వస్తుందని చెప్పాడు ఈయన. అయితే డబ్బులకు ఆశపడి ఓటిటిలోనే సినిమాలు విడుదల చేస్తూ పోతే తర్వాత తీవ్రంగా నష్టపోతామంటున్నాడు రాజా.
Published by:Praveen Kumar Vadla
First published: