హోమ్ /వార్తలు /సినిమా /

Sai Dharam Tej - VK Naresh: ఆ బైక్స్ బ్యాన్ చేయాలి.. సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై నరేష్ సీరియస్ కామెంట్స్..

Sai Dharam Tej - VK Naresh: ఆ బైక్స్ బ్యాన్ చేయాలి.. సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై నరేష్ సీరియస్ కామెంట్స్..

నరేష్ సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej Naresh)

నరేష్ సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej Naresh)

Sai Dharam Tej - VK Naresh: సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej - VK Naresh) బైక్ యాక్సిడెంట్‌తో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. తాజాగా ఈ ప్రమాదంపై సీనియర్ నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. సాయి తేజ్ వాడిన బైక్‌పై కూడా ఈయన ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాడు.

ఇంకా చదవండి ...

సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్‌తో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. ఆయనకు ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై అన్ని కోణాల్లోనూ పోలీసులు ధర్యాప్తు మొదలు పెట్టారు. అసలు ఆ యాక్సిడెంట్ జిరగే ముందు సాయి ఎక్కడ్నుంచి వస్తున్నాడు.. దానికి ముందు ఏం చేసాడు.. ఏదైనా పార్టీ చేసుకున్నారా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. ఆయన కొడుకు నవీన్ విజయ్ కృష్ణ, సాయి ధరమ్ తేజ్ ప్రాణ స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. ఇప్పటికీ వాళ్ళిద్దరూ కలవని రోజంటూ లేదన్నట్లు ఉంటారు. ప్రమాదం జరిగే ముందు కూడా ఆ ఇద్దరు, మరో వ్యక్తి కలిసి ఓ ఓపెనింగ్‌కు వెళ్లినట్లు తనకు చెప్పారని నరేష్ మీడియాకు తెలిపాడు. బైక్స్‌పై వెళ్లేటప్పుడు వాళ్లను ఎప్పటికప్పుడు వార్న్ చేస్తూనే ఉంటానని.. బైక్స్ జర్నీ మంచిది కాదని చెప్తూనే ఉంటానని తెలిపాడు నరేష్.

అయినా కూడా వినలేదని.. నిన్న కూడా సాయికి బైక్‌పై వద్దని చెప్పేలోపే వెళ్లిపోయాడని చెప్పుకొచ్చాడు నరేష్. తమ ఇంటినుంచే బయల్దేరిన సాయి ధరమ్ తేజ్ మధ్యలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని.. అతనికి ఏం కాదని.. బాగానే ఉన్నాడని.. ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేసాడు. సాయి ధరమ్ తేజ్‌కు మంచి భవిష్యత్తు ఉందని.. మళ్లీ కోలుకొని షూటింగ్‌కు వస్తాడని చెప్పుకొచ్చాడు. పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాల్సిన సమయంలో ఇలాంటి రిస్కులు ఎవరు తీసుకోవద్దు ఆయన చెప్పాడు.

Seetimaarr 1st day collections: గోపీచంద్ ‘సీటీమార్’ ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్స్.. కూత అదిరింది..!



ఇప్పుడు వాళ్లు చిన్న పిల్లలు కాదని.. పెళ్లి వయసుకు కూడా వచ్చేసారని.. ఇలాంటి సమయంలో తామేం చెప్పలేమంటున్నాడు నరేష్. అన్నీ వాళ్లే అర్థం చేసుకోవాలని.. తన దృష్టిలో సెలబ్రిటీలు బైక్స్ పూర్తిగా నడపడం ఆపేయాలి అంటూ సూచించాడు. తన కొడుకుతో నవీన్‌తో పాటు సాయి తేజ్ దగ్గర కూడా 1000 సిసి స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయని.. అలాంటి వాటిని రోడ్డుమీదికి తీసుకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు ఈయన. అసలు మన దగ్గర అంత సీసీ బైక్స్ పూర్తిగా బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి సూచించాడు ఈయన.

Actor Ramesh Valiyasala suicide: ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య.. ఇంట్లో ఉరి వేసుకుని..


గతంలో కూడా కొందరు ప్రముఖుల వారసులు రోడ్డు ప్రమాదాల్లోనే మరణించడం చూసామని.. ఇకపై అయినా ఇలాంటి ఘోరాలు జరక్కుండా ఉండాలంటే ఈ బైక్స్‌ను పూర్తిగా బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నరేష్. కనీసం ఇంత సీసీ బైక్స్ వరకే రోడ్లపై పర్మిషన్ ఇవ్వాలంటున్నాడు ఈయన. వాళ్లకు ఏదో బైక్ స్పోర్ట్స్ క్లబ్ ఉందని.. అక్కడ రేసులు కూడా చేస్తారు అంటూ సాయి ధరమ్ తేజ్, నవీన్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు నరేష్. సాయి ధరమ్ తేజ్ తనకు కూడా కొడుకు లాంటి వాడే అని.. త్వరగానే కోలుకుని మళ్లీ వచ్చేస్తాడు చూడండి అంటూ చెప్పుకొచ్చాడు ఈ సీనియర్ నటుడు. మరోవైపు అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. మెగా మేనల్లుడు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నారు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Naresh, Sai dharam tej accident, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు