Home /News /movies /

TOLLYWOOD SENIOR ACTOR NARESH FILED CASE IN HYDERABAD CCS POLICE STATION ABOUT RS 7 50 CRORE FRAUD FULL DETAILS HERE HSN

Senior Actor Naresh: రూ.7.50 కోట్లు తీసుకుని అతడు నన్ను మోసం చేశాడంటూ కేసు పెట్టిన సీనియర్ నటుడు నరేష్.. ఇంతకీ అసలేం జరిగిందంటే..

సీనియర్ నటుడు నరేష్ (ఫైల్ ఫొటో)

సీనియర్ నటుడు నరేష్ (ఫైల్ ఫొటో)

నన్ను నమ్మించి మోసం చేశాడు. దాదాపు రూ.7.50 కోట్లు తీసుకున్నాడు. ఆరేళ్లుగా అడుగుతున్నా పట్టించుకోవడం లేదు.. అంటూ టాలీవుడ్ సీనియర్ నటుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఓ వ్యక్తిపై కేసు పెట్టారు.

    ’ఓ వ్యక్తి నన్ను ఫైనాన్స్ చేయమని అడిగాడు. కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తే కదా అని దాదాపు రూ.7.50 కోట్ల రూపాయలు ఇచ్చాను. ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వడం లేదు. నేను మోసపోయాను. అతడిని అదుపులోకి తీసుకుని నాకు న్యాయంచేయండి. నా డబ్బు నాకు తిరిగి ఇప్పించండి‘.. ఈ మాటలు అన్నది ఏ వ్యాపరవేత్తో, రాజకీయ నాయకుడో కాదు. ఓ సినీ నటుడు. అవును.. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ఓ వ్యక్తి చేతిలో మోసపోయారు. ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు చేసిన వెంటనే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    టాలీవుడ్ లో కాస్త స్థిరపడి నాలుగు రూపాయలు సంపాదిస్తున్న ప్రతీ నటుడు ఏదో ఒక వ్యాపారం చేయడమో, పెట్టుబడులు పెట్టడమో చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోలందరికీ వారి వారి స్థాయిల్లో వ్యాపారాలు ఉన్నాయి. ఒకప్పుడు హీరోగా పలు హిట్ సినిమాల్లో నటించి ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ ఇరగదీస్తున్న సీనియర్ హీరో నరేష్ కు కూడా పలు వ్యాపారాలు ఉన్నాయి. డబ్బులను ఫైనాన్స్ చేస్తుంటారు కూడా. ఆయన కుటుంబానికి బాగా తెలిసిన లింగం శ్రీనివాస్ అనే వ్యక్తి కీస్టోన్ అనే కంపెనీని నడుపుతున్నారు. కీస్టోన్ ఇన్ఫా కంపెనీల పేరుతో తమకు చెందిన బిల్డర్స్ ఫీనిక్స్ లో అసోసియేట్ అయి సైనింగ్ అథారిటీగా శ్రీనివాస్ ఉన్నాడు. నరేష్ కుటుంబంతో కూడా శ్రీనివాస్ కు వ్యక్తిగత స్థాయిలో సంబంధాలు ఉన్నాయి. దీంతో అతడు అడగటంతో దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలను హ్యాండ్ ఫైనాన్స్ రూపంలో నరేష్ ఇచ్చాడు. దాదాపు ఆరేళ్ల క్రితం ఆ డబ్బులను ఇచ్చాడు.
    ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!

    అప్పటి నుంచి పలుమార్లు ఆ డబ్బు గురించి అడిగినా సమాధానం దాటవేస్తున్నాడు. ఆ డబ్బు ప్రస్తావనే తీసుకురావడం లేదు. ఎన్నిసార్లు, ఎన్ని రూపాల్లో అడిగినా, పలువురు పెద్దల మధ్యవర్తిత్వంతో డబ్బు తిరిగి చెల్లించాల్సిందిగా చెప్పినప్పటికీ శ్రీనివాస్ లక్ష్యపెట్టలేదు. దీంతో తనను మోసం చేశాడంటూ శ్రీనివాస్ పై సీసీఎస్ పోలీసులకు నరేష్ ఫిర్యాదు చేశాడు. ‘నా దగ్గర ఫైనాన్స్ రూపంలో రూ.7.50 కోట్లు తీసుకున్నాడు. వడ్డీతో కలిపి దాదాపుగా రూ.10 కోట్లు అవుతుంది. వడ్డీ కాదు కదా అసలు డబ్బును అడిగినా కూడా పట్టించుకోవడం లేదు. అతడిపై మోసం కేసు నమోదు చేసి నా డబ్బును నాకు తిరిగి ఇప్పించండి‘ అని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని నరేష్ వ్యాఖ్యానించాడు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Hyderabad, Naresh, Tollywood, Tollywood actor, Vyjayanthi Movies

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు