Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి గురించి పెదనాన్న కృష్ణంరాజు షాకింగ్ కామెంట్స్.. ఎందుకిలా..

కృష్ణంరాజు, ప్రభాస్ (ఫైల్ ఫోటో)

Prabhas Marriage: బాహుబలి తరువాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాత సాహో సినిమా కూడా వచ్చిపోయింది. ఇక ప్రస్తుతం రెండు మూడు సినిమాలకు కమిటైన ప్రభాస్.. పెళ్లి గురించి మాత్రం పెద్దగా ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు.

  • Share this:
    టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్ ఎవరంటే.. ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది ప్రభాస్ పేరే. టాలీవుడ్‌లో మరే ఇతర హీరోకు సాధ్యపడని పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ యంగ్ రెబల్ స్టార్.. పెళ్లి విషయంలో మాత్రం ఇంకా ఎటూ తేల్చడం లేదు. అప్పట్లో బాహుబలి షూటింగ్ పూర్తయిన తరువాత ప్రభాస్ పెళ్లి చేస్తామంటూ ప్రకటించిన ఫ్యామిలీ.. ఆ తరువాత ఆ విషయం గురించి మాట్లాడటం లేదు. మధ్య మధ్యలో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయ్యిందనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ పెళ్లి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తన పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ పెళ్లి గురించి ఆయన పెదనాన్న, టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు ఒకింత షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన పుట్టినరోజు సందర్భంగా తన సినీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక అంశాలపై మాట్లాడిన కృష్ణంరాజు.. ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడేందుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించకపోవడం గమనార్హం.

    అభిమానులంతా ఎదురుచూస్తున్న ప్రభాస్ పెళ్లి ఎప్పుడని ప్రశ్నిస్తే.. అయినప్పుడు అంటూ ఒకే మాటతో సమాధానం ఇచ్చారు కృష్ణంరాజు. ప్రభాస్ పెళ్లి కోసం అంతా ఎదురుచూస్తున్నారగా.. తాను కూడా అందుకోసం ఎదురుచూస్తున్నానని.. అయినప్పుడు చూద్దామని కాస్త అసంతృప్తిగా సమాధానం ఇచ్చారు కృష్ణంరాజు. అంతేకాదు ఈ విషయం గురించి ఆయన పెద్దగా మాట్లాడేందుకు ఇష్టపడలేదని... ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. గతంలో ప్రభాస్ గురించి ఎప్పుడు మాట్లాడిన కృష్ణంరాజు సానుకూలంగా మాట్లాడేవారు. అమ్మాయి కోసం వెతుకుతున్నామని.. త్వరలోనే పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబుతామని కృష్ణంరాజు చెబుతూ ఉండేవారు. అయితే ఆ తరువాత దీని గురించి ఆయన మాట్లాడటం లేదు.

    ఇక బాహుబలి తరువాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాత సాహో సినిమా కూడా వచ్చిపోయింది. ఇక ప్రస్తుతం రెండు మూడు సినిమాలకు కమిటైన ప్రభాస్.. పెళ్లి గురించి మాత్రం పెద్దగా ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మొత్తానికి పెళ్లి విషయంలో సాగదీస్తూ వస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... ఎప్పుడు పెళ్లి చేసుకుని తమ కోరిక తీరుస్తాడా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: