హోమ్ /వార్తలు /సినిమా /

Hero Kartikeya: సైలెంట్‌గా హీరో కార్తికేయ నిశ్చితార్థం.. ఫోటోలు లీక్!

Hero Kartikeya: సైలెంట్‌గా హీరో కార్తికేయ నిశ్చితార్థం.. ఫోటోలు లీక్!

Hero Kartikeya

Hero Kartikeya

Hero Kartikeya: 2018లో అజయ్ భూపతి దర్శకత్వంలో మంచి సక్సెస్ అందుకున్న సినిమా ఆర్ ఎక్స్ 100. ఈ సినిమాతో హీరో కార్తికేయ ఓవర్ నైట్ స్టార్ గా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

  Hero Kartikeya: 2018లో అజయ్ భూపతి దర్శకత్వంలో మంచి సక్సెస్ అందుకున్న సినిమా ఆర్ ఎక్స్ 100. ఈ సినిమాతో హీరో కార్తికేయ ఓవర్ నైట్ స్టార్ గా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. ఈ సినిమా కంటే ముందు ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా ఈ సినిమా అంత సక్సెస్ అందుకోలేదు. ఇక ఆర్ఎక్స్ 100 తర్వాత వరుస సినిమాలలో నటించగా అంత గుర్తింపు అందుకోలేకపోయాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటి వాడయ్యాడు కార్తికేయ.

  గత ఏడాది నుండి యంగ్ హీరోలంతా పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా కాజల్ అగర్వాల్, నిహారిక కొణిదెల కూడా పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అవ్వగా.. కొన్ని రోజుల కిందట టాలీవుడ్ హీరోయిన్ మెహరిన్ నిశ్చితార్థం చేసుకున్న తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఇక ఇదంతా పక్కన పెడితే కార్తికేయ కూడా నిశ్చితార్థం చేసుకున్నాడు.

  తాజాగా కార్తికేయ నిశ్చితార్థానికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా.. ఆ ఫోటో చూసిన నెటిజన్లు కార్తికేయ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆదివారం సాయంత్రం ఫంక్షన్ హాల్ లో కార్తికేయ నిశ్చితార్థ వేడుకలు కుటుంబ సమక్షంలో ఘనంగా జరిగాయి. ఇక ఈ వేడుకకు ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. ఇక కార్తికేయను పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి వివరాలు తెలియక పోగా అమ్మాయి మాత్రం అందంగా ఉందని.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని నెట్టింట్లో తెగ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

  ఇక కార్తికేయ ఈ పెళ్లి గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నాడు. కార్తికేయ హీరోగానే కాకుండా విలన్ పాత్రలలో కూడా మెపిస్తున్నాడు. ప్రస్తుతం రాజా విక్రమార్క సినిమా లో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా యు.వి.క్రియేషన్స్ లో కూడా ఓ ప్రాజెక్టు ను ఓకే చేసినట్లు తెలుస్తుంది.

  Published by:Navya Reddy
  First published:

  Tags: Ajay bhupathi, Hero karthikeya marriage, Hero kartikeya, Payal rajputh, Rx 100, Tollywood