Home /News /movies /

TOLLYWOOD REBEL STAR PRABHAS RADHE SHYAM CINEMA TO RELEASE IN OTT NR

Prabhas Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఓటీటీలో విడుదలకానున్న 'రాధేశ్యామ్'.. రిలీజ్ డేట్?

radhe shyam

radhe shyam

Prabhas Radhe Shyam: ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సిని ఇండస్ట్రీకి ఓ పెద్ద విలన్ గా మారింది. గత ఏడాది నుండే ఈ వైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీ దెబ్బతినగా.. ఇప్పుడు మళ్లీ ఎదురుపడింది.

    Prabhas Radhe Shyam: ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సిని ఇండస్ట్రీకి ఓ పెద్ద విలన్ గా మారింది. గత ఏడాది నుండే ఈ వైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీ దెబ్బతినగా.. ఇప్పుడు మళ్లీ ఎదురుపడింది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు భారీ బడ్జెట్ తో వరుసగా తెరకెక్కుతున్న సమయంలో.. సినీ ఇండస్ట్రీపై వైరస్ విలయతాండవం చేస్తుంది. ఇప్పటికే పెద్ద పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో థియేటర్లు, పలు రంగాలు మూతపడ్డాయి.

    రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో.. సినీ ఇండస్ట్రీలో సినిమా వాయిదాల నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమలో కూడా చాలామంది నటీనటులకు, సినీ బృందాలకు వైరస్ వ్యాపించగా సినిమా షూటింగ్ లు అన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక చిన్న చిన్న సినిమాలు థియేటర్ల పై ఆధారపడకుండా ఓటీటీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కూడా ఓటీటీ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉందని తెలుస్తుంది.

    నిజానికి పెద్ద పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ తో పెట్టి ఓటీటీ లో విడుదల చేస్తే.. పెట్టిన పెట్టుబడి కూడా దాటడం కష్టం అవుతుంది. అలాంటిది థియేటర్లలో విడుదల చేయాలంటే భారీ బడ్జెట్ తో తీసినందుకు.. ప్రస్తుతం థియేటర్ వరకు ఎదురు చూడాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓ కొత్త విధానాన్ని వెతికింది సినీ ఇండస్ట్రీ.

    పే పర్ వ్యూ విధానంతో ఓటీటీ లో విడుదల చేసేందుకు.. సల్మాన్ ఖాన్ రాధే: ది మోస్ట్ వాంటెడ్ బాయ్ సినిమాను మే 13న విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని తెలిసింది. ఇక తాజాగా ప్రభాస్ కూడా తన 'రాధేశ్యామ్' సినిమాను పే పర్ వ్యూ విధానంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట.



    ఈ సినిమాను మామూలుగా జులై 30న విడుదల చేయడానికి నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించగా.. అప్పటికీ పరిస్థితులు మార్పులతో యధావిధిగా ఉంటే థియేటర్లు తెరుచుకునే నేపథ్యంలో ఉన్నట్లయితే అందులోనే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పరిస్థితులు అనుకూలంగా లేకుండా ఉన్నట్లయితే ఓటీటీ ద్వారా విడుదల చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Ott release, Prabhas, Radhe Shyam, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు