టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మృతి..

సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలుగులో 50కి పైగా చిత్రాలకు ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌గా పనిచేసిన బండారు ప్రసాద్ బాబు కన్నుమూసారు.

news18-telugu
Updated: August 13, 2020, 10:31 PM IST
టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మృతి..
టాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ బండారు ప్రసాద్ బాబు కన్నుమూత (Twitter/Photo)
  • Share this:
సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనాతో ఓ వైపు సినిమా షూటింగ్స్‌లో పాటు థియేటర్స్ మూతతో  కోలుకోకుండా తయారైన ఇండస్ట్రీకి ప్రముఖుల వరుస మరణాలు మరింతగా బాధిస్తున్నాయి. తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్‌లో 50కి పైగా చిత్రాలకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పలు చిత్రాలకు మేనేజర్‌గా పనిచేసిన బండారు ప్రసాద్ బాబు ఈ గురువారం కన్నుమూశారు. ఈయన వయసు 57 సంవత్సరాలు. హైదరాబాద్ సన్ షైన్ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఈయన కన్నమూసారు. ఆయనకు భార్య అంజలి, మురళీ మోహన్, వినయ్ కుమార్ అనే ఇద్దరు కుమారులున్నారు. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌ ప్రసాద్ బాబు మరణం పట్ల టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాపం ప్రకటించింది. అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 13, 2020, 10:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading