Home /News /movies /

TOLLYWOOD PRODUCERS COUNCIL TALK ABOUT SUCCESS OF BIMBISARA SITA RAMAM MOVIES TA

Bimbisara - Sita Ramam : సినిమాల సక్సెస్‌‌తో తెలుగు సినీ పరిశ్రమకు మళ్ళీ మంచిరోజులు వచ్చాయి.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ...

బింబిసార,సీతారామం మూవీ సక్సెస్‌లపై నిర్మాతల మండలి హర్షం (Twitter/Photo)

బింబిసార,సీతారామం మూవీ సక్సెస్‌లపై నిర్మాతల మండలి హర్షం (Twitter/Photo)

bimbisara - Sita Ramam | 05-08-2022 రిలీజ్ అయిన “బింబిసార” మరియు “ సీతారామమ్“ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ఆదరణతో బ్రహాండమైన విజయాన్ని పొందగలిగాయన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    Bimbisara - Sita Ramam :  05-08-2022 రిలీజ్ అయిన “బింబిసార” మరియు “ సీతారామమ్“ చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ఆదరణతో బ్రహాండమైన విజయాన్ని పొందగలిగాయి. “బింబిసార” చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లతో రన్ అవుతుంది.. ఈ చిత్రం నిర్మాత మరియు హీరో అయిన నందమూరి కళ్యాణ్ రామ్ గారు “బింబిసార” పాత్రలో అద్భుతమైన నటనను చూసి ప్రేక్షకులు ఆనందోత్సవాల్లో తేలిపోతున్నారన్నారు. ముఖ్యముగా కరోనా మూలంగా ప్రేక్షకులు థియేటర్లకు రాని సమయంలో తెలుగు చిత్రం  ‘అఖండ’ప్రేక్షకులను థియేటర్ల కు రప్పించగలిగింది. ప్రస్తుతము సినిమా పరిశ్రమ అనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్న సమయంలో ప్రేక్షకులు థియేటర్ కు రావడం కష్టతరం అయినది. ఇటువంటి సమయంలో “బింబిసార” సినిమా ప్రేక్షకుణ్ణి థియేటర్ కు రప్పించగలిగింది. థియేటర్ల వద్ద ఒక పండుగ వాతావరణం నెలకొంది.

    ఇంతకుముందు “నందమూరి తారక రామారావు ఆర్ట్స్” బ్యానర్ పై పరిచయం అయిన కొత్త డైరెక్టర్లు శ్రీ. సురేందర్ రెడ్డి మరియు శ్రీ అనిల్ రావిపూడి వీరు ప్రస్తుతం లీడింగ్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ" బింబిసార " సినిమా విజయంతో కొత్త డైరక్టర్ అయిన వశిష్ఠ్  ప్రముఖ డైరక్టర్ల లిస్ట్ లో చేరిపోయారు. అలాగే ఈ రోజు “వైజయంతీ మూవీస్” బ్యానర్ లో గతంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకొని " మహానటి " “జాతిరత్నాలు"తో అఖండ విజయాలను అందుకుని నేడు విడుదలైన చిత్రం " సీతారామమ్ " విజయపథంలో దూసుకుని పోతూంది.



    ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొంది నిర్మాతలు వైజయంతి మూవీస్ అధినేతలు శ్రీ అశ్వనీదత్, స్వప్న దత్ , శేషు ప్రియాంక దత్ దర్శకులు శ్రీ హను రాఘవ పూడికు క్లాసిక్ చిత్రంగా మంచి పేరు తీసుకొనివచ్చింది. ప్రస్తుత సినిమా పరిశ్రమ ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఈ రెండు సినిమాలు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ‘ఆక్సిజన్’ అందించినట్టుగా అందరు భావిస్తున్నారు. కాబట్టి  ‘తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి’ తరపున పై రెండు చిత్ర నిర్మాతలకు, దర్శకులకు మరియు సాంకేతిక నిపుణులకు, ఇంత ఘనవిజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.

    Krithi Shetty: మాచర్ల నియోజకవర్గం ఎంటర్టైనింగ్‌గా వుంటుంది.. ఫ్యామిలీస్ థియేటర్‌కు వస్తారు..కృతిశెట్టి ఇంటర్వ్యూ ..


    ఇక బింబిసార మొదటి రోజు.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.50 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఇక సీతారామం సినిమా రూ. 3.5 కోట్లు రాబట్టింది. మొత్తంగా కళ్యాణ్ రామ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా బింబిసార నిలిచింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు