రెండు తెలుగు రాష్ట్రాల్లో గాని దేశంలో కానీ ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవించినపుడు నేను సైతం అంటూ మానవత్వాన్ని చాటుకునే వాళ్లలో మన తెలుగు వాళ్లు ఉన్నారు. తాజాగా కరోనా మహామ్మారి కారణంగా ప్రపంచమే స్థంభించిపోయింది. ఈ వైరస్ కట్డడిలో భాగంగా కేంద్రం దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది పేదవాళ్లతో పాటు సినీ కార్మికులు కూడా ఉన్నారు. వీళ్లను ఆదుకోవడంలో భాగంగా హీరోలు,దర్శకులు, నిర్మాతలు ముందు వరసలో ఉన్నారు. ఇప్పటికే చాల ా మంది తెలుగు హీరోలు, నిర్మాతలు, దర్శకులు కరోనా పై పోరాటంలో తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా తెలుగు నిర్మాతల మండలి కూడా కరోనా పై పోరాటంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.25 లక్షల విరాళాన్ని అందజేసారు. ఈ విరాళాన్ని ప్రముఖ నిర్మాత పద్మాలయా స్టూడియోస్‌పై పలు చిత్రాలను నిర్మించిన సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు జి.ఆదిశేషగిరి రావుతో పాటు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించిన కే.యస్.రామారావు అందజేసారు. ఈ విరాళాన్ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేసారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana Government, Tollywood