Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    జూబ్లీహిల్స్ పోలీసుల ముందుకు హాజరైన నిర్మాత పివిపి..

    PVP: తెలుగు ఇండస్ట్రీలో భారీ సినిమాలతో పాటు అప్పుడప్పుడూ భారీ వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తుంటాడు నిర్మాత, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ఉరఫ్ పివిపి.

    Praveen Kumar Vadla | news18-telugu
    Updated: August 14, 2020, 4:56 PM IST
    జూబ్లీహిల్స్ పోలీసుల ముందుకు హాజరైన నిర్మాత పివిపి..
    పివిపి (pvp)
    • Share this:
    తెలుగు ఇండస్ట్రీలో భారీ సినిమాలతో పాటు అప్పుడప్పుడూ భారీ వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తుంటాడు నిర్మాత, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ఉరఫ్ పివిపి. ఈయన తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. తన దగ్గర మేనేజర్‌గా పని చేసిన తిమ్మారెడ్డి అనే వ్యక్తిని గత సెప్టెంబర్ 16న పీవీపీ కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పీవీపీని ఏ1 నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.
    PVP (Source: Twitter)
    PVP (Source: Twitter)


    ఆ తర్వాత బంజారాహిల్స్‌లో ఓ విల్లాకు సంబంధించిన గొడవలో ఆ విల్లా యజమాని పీవీపీపై ఫిర్యాదు చేశాడు. ఈ కేసుకు సంబంధించి ప్రశ్నించడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళగా.. పీవీపీ కుటుంబ సభ్యులు ఏకంగా కుక్కలను వదిలారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పీవీపీ హైదరాబాద్‌ను విడిచి విజయవాడ వెళ్లాడు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
    PVP (Source: Twitter)
    PVP (Source: Twitter)

    ఈ రెండు కేసుల విచారణకు రావాలని పోలీసులు పిలవడంతో... విజయవాడ నుంచి ఆయన ఆగస్ట్ 14న జూబ్లిహిల్స్ పోలీసుల ముందుకు విచారణకు వచ్చారు. అతడితో పాటు భార్య, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే గతేడాది మహర్షి సినిమాలో ముగ్గురు నిర్మాతల్లో పివిపి కూడా ఒకరు. దిల్ రాజు, అశ్వినీ దత్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాడు పివిపి.
    Published by: Praveen Kumar Vadla
    First published: August 14, 2020, 4:56 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading