Home /News /movies /

TOLLYWOOD PRODUCER TELU RADHAKRISHNA INTRESTING COMMENTS ON JR NTR IN ARDASATHABDAM INTERVIEW NR

NTR: ఎన్టీఆర్ పుట్టుక అంతే అంటూ నిర్మాత షాకింగ్ కామెంట్స్?

NTR

NTR

NTR: టాలీవుడ్ యంగ్ స్టార్ ఎన్టీఆర్. ఈయన పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

    NTR: టాలీవుడ్ యంగ్ స్టార్ ఎన్టీఆర్. ఈయన పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికి తెలిసిందే. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తన సినిమాలతో ఎక్కువ శాతం మంచి సక్సెస్ లను అందుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ పుట్టుక గురించి ఓ సినీ నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేశాడు.

    ఇంతకీ ఆ నిర్మాత ఎవరో కాదు రాధాకృష్ణ. అర్థ శతాబ్దం సినిమాకు నిర్మాతగా చేసిన రాధాకృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్టీఆర్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్ తో కలసి ఆది సినిమా లో కూడా చిన్న పాత్రలో నటించాడు రాధాకృష్ణ. ఇక ఎన్టీఆర్ పుట్టుకతోనే ఆర్టిస్ట్ అని పైగా ఆయన ఎనర్జీని పోల్చుకోవడం అంత సులభం కాదని తెలిపాడు. ఇక ఎన్టీఆర్ ఆది సినిమాలో నటిస్తున్న సమయంలో క్లైమాక్స్ ఫైట్ కోసం గోల్కొండ స్కూల్ లో ప్లాన్ చేశారట.

    ఇక ఆ ఫైట్ లో భాగంగా ఓ ఫోటో ఫ్రేమ్ గ్లాస్ ను గట్టిగా చేతితో తగిలించే ఫైట్ వుండగా ఆ సమయంలో ఎన్టీఆర్ తో గాయమైందట. చేతిలో గాజు ముక్కలు దిగడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లి కుట్లు వేయించుకున్నాడట ఎన్టీఆర్. ఇక వెంటనే మళ్లీ షూటింగ్ లో వచ్చి పాల్గొన్నాడని తెలిపాడు రాధాకృష్ణ. దాంతో ఎన్టీఆర్ డెడికేషన్ అలాంటిది అంటూ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. దీనిని బట్టి ఎన్టీఆర్ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసిపోతుంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలోనే కాకుండా త్రివిక్రమ్, బుచ్చిబాబు దర్శకత్వంలో వరుస సినిమాలలో చేయనున్నాడు. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Ardasathabdam, Interesting comments, Jr ntr, Tarak, Telu radha krishna, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు