నెపొటిజమ్‌పై సురేష్ బాబు కామెంట్స్.. అభిరామ్‌ను స్టార్‌ చేయగలనా..?

Suresh Babu on Nepotism: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత చాలా మంది సినిమా ఇండస్ట్రీలో నెపోటిజమ్ గురించి మాట్లాడుతున్నారు. దీనిపై చాలా విమర్శలే వస్తున్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 30, 2020, 4:09 PM IST
నెపొటిజమ్‌పై సురేష్ బాబు కామెంట్స్.. అభిరామ్‌ను స్టార్‌ చేయగలనా..?
నిర్మాత సురేష్ బాబు (suresh babu)
  • Share this:
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత చాలా మంది సినిమా ఇండస్ట్రీలో నెపోటిజమ్ గురించి మాట్లాడుతున్నారు. దీనిపై చాలా విమర్శలే వస్తున్నాయి. పనికిరాని వాళ్లను.. నటన అస్సలు రాని వాళ్లను కూడా తీసుకొచ్చి ప్రేక్షకుల నెత్తిమీద కూర్చోబెడుతున్నారని.. కొందరికి కనీసం మొహంలో ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఉండవని చాలా పెద్ద విమర్శలే వస్తున్నాయి. బాలీవుడ్‌లో అలియా భట్, సోనమ్ కపూర్, అర్జున్ కపూర్ లాంటి వాళ్లకు అసలు నటన అనేది వచ్చా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
సోనమ్ కపూర్ (Sonam Kapoor/Twitter)
సోనమ్ కపూర్ (Sonam Kapoor/Twitter)


ఫ్లాపులకు కేరాఫ అడ్రస్‌గా ఉండే సోనమ్ కపూర్‌కు వరసగా సినిమాలు ఎందుకొస్తున్నాయి.. ఎలా వస్తున్నాయి.. కపూర్ వారసురాలు కాబట్టి.. దీనికి నో అని చెప్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీలో కూడా నెపొటిజమ్ గురించి చర్చ జరుగుతుంది. ఇక్కడ కూడా వారసులే ఎక్కువగా ఉన్నారు. దీనిపై ఇప్పుడు నిర్మాత సురేష్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో నెపోటిజం గురించి తాను మాట్లాడను కానీ.. ఎవరికైనా టాలెంట్ ఉంటేనే ఎదుగుతారని చెప్పాడు.
సురేష్ బాబు, వెంకటేష్ (Twitter/Photo)
సురేష్ బాబు, వెంకటేష్ (Twitter/Photo)

సుశాంత్ విషయానికి వస్తే ఆయన చాలా టాలెంటెడ్.. చిన్న వయసులోనే ఎంతో సాధించాడు.. బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా నిలిచాడని చెప్పాడు సురేష్ బాబు. సూపర్ స్టార్ కావాల్సిన వాడు తొందరపడ్డాడని అభిప్రాయపడ్డాడు ఈయన. నెపోటిజం అనేది తెలిసో తెలియకో ఉంటుందని ఒప్పుకున్నాడు ఈ నిర్మాత. అయితే ఆ ప్రభావం సక్సెస్‌ అయిన వారసులపై ఉంటుంది.. అలాగే కాని వాళ్లపై కూడా ఉంటుంది. పెద్ద కుటుంబాల నుంచి వచ్చి ఫ్లాప్ అయిన హీరోలు లేరా అంటూ ప్రశ్నిస్తున్నాడు ఈ నిర్మాత. జీవితంలో ఆటుపోట్లు ఉంటాయని.. వాటిని దాటితేనే విజయం వస్తుందనే విషయం గుర్తించుకోవాలని చెప్పాడు సురేష్ బాబు.
తనయుడు అభిరామ్‌తో సురేష్ బాబు (Abhiram Suresh Babu)
తనయుడు అభిరామ్‌తో సురేష్ బాబు (Abhiram Suresh Babu)

మన ఇండస్ట్రీలో రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, రాజ్‌ తరుణ్ లాంటి వాళ్లంతా ఏ అండ లేకుండా వచ్చి స్టార్స్ కాలేదా అని ప్రశ్నించాడు సురేష్ బాబు. తన విషయానికి వస్తే తాను చిన్న కొడుకు అభిరామ్‌కు హీరోగా అవకాశం ఇవ్వగలను కానీ అతన్ని సక్సెస్ చేసే మ్యాజిక్ తనకు తెలుసా అంటున్నాడు. తనే హీరోగా ఎదగాలి.. దానికి ఎవరి సాయం ఉండదు.. సొంతంగా ఎదిగినపుడే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పాడు. ప్రస్తుతం సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
First published: June 30, 2020, 4:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading