తెలుగు చలన చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్ దిగ్గజం కె విశ్వనాథ్ మరణ వార్త నుంచి తేరుకోకముందే మరో విషాద వార్త బయటకొచ్చింది. ప్రముఖ నిర్మాత ఆర్.వి. గురుపాదం (Rv Gurupadam Death) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 53 సంవత్సరాలు. బెంగళూరులోని తన నివాసంలోనే గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన తుది శ్వాస విడిచారు. గురుపాదం మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తెలుపుతున్నారు.
తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడలో 25పైగా చిత్రాలను గురుపాదం నిర్మించారు. తెలుగులో వయ్యారి భామలు బగలమారి భర్తలు, పులి బొబ్బిలి సినిమాలకు గురుపాదం నిర్మాతగా వ్యవహరించారు. హిందీలో శ్రీదేవి హీరోయిన్ గా వచ్చిన అకల్ మాండ్ చిత్రానికి గురుపాదం నిర్మాతగా వ్యవహరించారు.
తెలుగులో అప్పట్లో వచ్చిన వయ్యారి భామలు బగలమారి భర్తలు సినిమా కృష్ణ, ఎన్టీఆర్ కలసి నటించారు. వాళ్లిద్దరూ కలిసి నటించిన ఐదవ చిత్రం ఇది. దీనికి కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించగా.. గురుపాదం నిర్మాతగా వ్యవహరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cinema, Tollywood, Tollywood actor