Dil Raju: జీహెచ్ఎంసీ కార్మికులకు తన వంతు సాయం చేసిన నిర్మాత దిల్‌రాజు..

GHMC కార్మికులకు మాస్కులు,శానిటైజర్లు పంపిణీ చేసిన నిర్మాత దిల్‌రాజు (Twitter/Photo)

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్‌ను ప్రకటించింది. తాజాగా దిల్ రాజు జీహెచ్ఎంసీ కార్మికులకు తన వంతు సాయం చేసారు.

  • Share this:
    కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్‌ను ప్రకటించింది. కానీ కరోనా వైరస్ అంతకంతకు పెరిగిపోతూ ఉండటంతో కేంద్రం మే 3 వరకు లాక్‌డౌన్ ప్రకటించింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమకు చేతనైనంత సాయం చేస్తున్నారు. అందులో భాగంగానే అందరికీ మద్దతుగా నిలిచేందుకు పలువురు  ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు తమంతటతాముగా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు. ఇప్పటికే  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ తరపున ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు.రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో రాష్ట్రానికి రూ.10 లక్షల చొప్పును ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళం అందజేసారు. తాజాగా ఆయన హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ కార్మికుల కోసం మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేసారు. ఈ పంపిణీ కార్యక్రమంలో హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఉన్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: