Home /News /movies /

వామ్మో దిల్ రాజు ఏంటి ఇంత స్లిమ్ అయిపోయాడు..?

వామ్మో దిల్ రాజు ఏంటి ఇంత స్లిమ్ అయిపోయాడు..?

నిర్మాత దిల్ రాజు స్లిమ్ లుక్ (dil raju new look)

నిర్మాత దిల్ రాజు స్లిమ్ లుక్ (dil raju new look)

Dil Raju: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతల్లో హీరోలతో సమానమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు దిల్ రాజు. ఈయనకు గోల్డెన్ రాజు అని కూడా పేరుంది. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత..

తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతల్లో హీరోలతో సమానమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు దిల్ రాజు. ఈయనకు గోల్డెన్ రాజు అని కూడా పేరుంది. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ వన్‌గా మారిపోయాడు. ఈ మధ్యే రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజు ఇప్పుడు పూర్తిగా మేకోవర్ అయిపోయాడు. తన లుక్ చూసిన తర్వాత అంతా షాక్ అయిపోతున్నారు. హీరోలా మారిపోయాడు ఈ నిర్మాత. 50 ఏళ్ళ దిల్ రాజు 30 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత దిల్ రాజు పూర్తిగా మారిపోయాడు. ఈయన తన ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేసినట్లు అర్థమవుతుంది.

భార్యతో దిల్ రాజు సెల్ఫీ (Twitter/Photo)
భార్యతో దిల్ రాజు సెల్ఫీ (Twitter/Photo)


తాజాగా విడుదలైన ఈయన లుక్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కూడా ఏం లేకపోవడంతో పూర్తిగా ఫిట్ నెస్‌పైనే దృష్టి పెట్టాడు ఈయన. తాజాగా తన భార్యతో కలిసి బ్యాడ్మింటన్ సెషన్ తర్వాత దిగిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో 50 ఏళ్ల దిల్ రాజు కాదు ఏకంగా 30 ఏళ్ల దిల్ రాజు కనిపిస్తున్నాడు. తాను ఆరోగ్యంగా ఉండటంతో పాటు హ్యాండ్సమ్‌గా కనిపించడానికి దిల్ రాజు బాగానే కష్టపడుతున్నాడని అర్థమవుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈయన.

భార్యతో దిల్ రాజు సెల్ఫీ (Twitter/Photo)
దిల్ రాజు (ఫైల్ ఫోటో)


ఇప్పటికే నాని, ఇంద్రగంటి కాంబినేషన్‌లో వస్తున్న వి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దాంతో పాటు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కూడా రిలీజ్ కానుంది. హిందీలో రీమేక్ అవుతున్న జెర్సీ సినిమాను కూడా అల్లు అరవింద్‌తో కలిసి నిర్మిస్తున్నాడు దిల్ రాజు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి అక్కడ కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మొత్తానికి దిల్ రాజు అటు సినిమాలతో పాటు ఫిట్ నెస్ కూడా పిచ్చెక్కిస్తున్నాడన్నమాట.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Dil raju, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు