అభిరామ్ కారు యాక్సిడెంట్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత సురేష్ బాబు..

తనయుడు అభిరామ్‌తో సురేష్ బాబు (Abhiram Suresh Babu)

Car Accident | టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ ప్రమాదానికి గురైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ వార్తలపై నిర్మాత సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు.

  • Share this:
    టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ ప్రమాదానికి గురైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. హైదరాబాద్ మణికొండలో అభిరామ్ కారు మరో కారును ఢీకొన్న ఈ సంఘటనలో  అభిరామ్ రాంగ్ రూట్లో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు  వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇరువురూ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్పందించారు. తన కుమారుడు యాక్సిడెంట్ చేశాడనే వార్తలను ఆయన ఖండించారు. యాక్సిడెంట్ చేసింది తనకు కుమారుడు అభిరామ్ కాదన్నారు. ఆ కారు కూడా తన కుమారుడిది కాదని క్లారిటీ ఇచ్చారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: