తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఫన్నీయెస్ట్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ బండ్ల గణేష్. ఈయనేం చేసినా కూడా నవ్వు వచ్చేస్తుంది. సినిమాల్లో కామెడీ చేసినట్లు బయట కూడా చేస్తుంటాడు బండ్ల. కొన్ని రోజలుగా ఈయన కేసీఆర్కు పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. ముఖ్యమంత్రి ఏం చెప్పినా కూడా ట్విట్టర్లో జై కొడుతున్నాడు. ఈయనకు సినిమాలతో పాటు మరో వ్యాపారం కూడా ఉంది. అదే ఫౌల్ట్రీ బిజినెస్. తెలంగాణలో ఫౌల్ట్రీ బిజినెస్ శాసించే స్థాయిలో ఉన్నాడు బండ్ల గణేష్. ఈయన బిజినెస్ రేంజ్ కూడా పెద్దదే. ఆ మధ్య చికెన్ తింటే మంచిది.. శక్తి పెరుగుతుందని కేసీఆర్ చెప్పడంతో ఆయనకు పాలాభిషేక్ చేసినంత పని చేసాడు బండ్ల.
ఎన్ని కష్టాలైనా భరిస్తాం ఎన్ని రోజులు ఎదురు చూస్తాం మాకు మీరు ఉన్నారని భరోసా మీరు ఉన్నారనే ధైర్యం మీరు రక్షిస్తారు నమ్మకం జై కేసీఆర్@TelanganaCMO
— BANDLA GANESH (@ganeshbandla) April 11, 2020
ఇప్పుడు మరోసారి ఇదే చేసాడు. లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు కేసీఆర్ చేసిన కామెంట్స్ చూసి సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసల వర్షం కురిపించాడు. దాన్ని మాటల్లో చెప్పడం కూడా సాధ్యం కాలేదు. మా క్షేమం కోసం సమాజం కోసం మా పిల్లల కోసం మా భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాల్లో సరిలేరు నీకెవ్వరు గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.. అంటూ మొదలు పెట్టి వరసగా మరో ఐదు ట్వీట్స్ చేసాడు. నాలుగు రోజులు కాదుసార్ మీద నమ్మకంతో మీరు ఉన్నారు అన్న భరోసాతో 40 రోజులు అయినా ఓపికతో ఇళ్లకే పరిమితం అవుతాం.. విజయం సాధిస్తాం జై కేసీఆర్.
మీరు చేసే కార్యక్రమాలు మీరు తీసుకునే నిర్ణయాలు అన్ని భగవంతునితో జయప్రదం కావాలని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ప్రేమ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బండ్ల గణేష్.. ఈ కఠోరమైన సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి కెసిఆర్ నాయకత్వంలో పని చేసి తెలంగాణ ప్రజలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలని అందర్నీ వేడుకుంటూ మీ బండ్ల గణేష్.. భారతదేశ చరిత్రలో ఇటువంటి సమయాల్లో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్న మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.. ఎన్ని కష్టాలైనా భరిస్తాం ఎన్ని రోజులు ఎదురు చూస్తాం మాకు మీరు ఉన్నారని భరోసా మీరు ఉన్నారనే ధైర్యం మీరు రక్షిస్తారు నమ్మకం జై కేసీఆర్.. అంటూ ముగించాడు ఈయన.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, CM KCR, Telugu Cinema, Tollywood